తెలుగు బుల్లితెరపై దూసుకెళ్తున్న బిగ్ బాస్ 5 తెలుగు ఈ మధ్యకాలంలోనే ప్రారంభమైంది. అయితే కరోనాతో వాయిదా పడుతూ వచ్చి ఎట్టకేలకు బుల్లితెర ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తోంది. ఇక హోరోహోరిగా సాగుతున్న ఈ రియాలిటీ షోలో ఈ సారి మినీ మాటల యుద్దాన్ని తలపిస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు. అప్పుడే కంటెస్టెంట్ సరయు ఎలిమినేట్ అయ్యారు. ఇక తాజా సమాచారం ప్రకారం బిగ్ బాస్ హౌస్ లోకి ఈ సారి గెస్ట్ గా మెగా హీరో వెళ్తున్నాడని తెలుస్తోంది.
మరి ఇందులో వాస్తవం ఎంత ఉందనేది మాత్రం తెలియదు. ఇటీవల కాలంలోనే స్టార్ గ్రూప్ అనుబంధ సంస్థ డిస్నీ హాట్‌స్టార్ కి రామ్ చరణ్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైన విషయం తెలిసిందే. ఇక దీని కారణంగానే ఈ సారి బిగ్ బాస్ లోకి గెస్ట్ గా రామ్ చరణ్ ని పంపనున్నట్లు బుల్లితెర వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇక ఈ వార్త నిజమేనంటు కూడా కొందరు చెవులు కొరుకుంటున్నారు. మరి నిజంగానే రామ్ చరణ్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నారా అనే ప్రశ్నకు మాత్రం సమాధానం రావాల్సి ఉంది. ఒకవేళ వెళ్తే గనుక హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ కి పండగనే చెప్పాలి.