సెట్టు శ్వేత ‘బిగ్ బాస్ 5 తెలుగు’ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. యానీ మాస్టర్‌కు ఒక వారం ఫ్రెండ్, మరో వారం డాటర్‌ను దూరం చేశాడు బిగ్ బాస్ అని అభిమానులు ఎంతో బాధ పడుతున్నారు. యానీ మాస్టర్ కూడా ఎంతగానో బాధపడిన విషయం తెలిసిందే. లోబో సీక్రెట్ రూమ్‌లో ఉండి హౌస్ యాక్టివిటీస్‌ని బాగా పరిశీలిస్తున్నాడు. సీక్రెట్ రూమ్‌లో ఒక అడ్వాంటేజ్ ఉన్నా కూడా.. ఈ వారం డైరెక్ట్ నామినేషన్స్‌లో ఉంటాడు లోబో. ఎవరు తన గురించి ఎలా మాట్లాడుతున్నారు అని తెలుసుకుంటున్నాడు. శ్వేత వెళ్లేటప్పుడు రవికి దూరంగా ఉండాలని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చాలానే అనుమానాలను రేపుతున్నాయి.
యాంకర్ రవికి బిగ్ బాస్ వల్ల వచ్చే లాభమేమో పక్కన పెడితే నెగెటివ్ పబ్లిసిటీ బాగా అవుతోంది. రవికి సంబంధించి ఇప్పటికే రెండుసార్లు చెప్పిన మాట, చేసిన పని చేయలేదని అభిమానుల ముందు దోషిగా నిలిచాడు. నాగార్జున కూడా రెండుసార్లు కెమెరా ముందు రవి గాలి తీసేశాడు అనే చెప్పాలి. రవి కావాలనే ఇలా చేస్తున్నాడా? లేక అలా జరిగిపోతోందా అన్న విషయం రవికే తెలియాలి. అప్పుడు లహరి షేరి విషయంలోనూ రవి ఒక మాట అని నేను అనలేదు మదర్ ప్రామిస్ అంటూ అందరి ముందు బుక్ అయ్యాడు. చాలా మంది తమను రవి ఇన్‌ఫ్లూఎన్స్ చేస్తున్నాడంటూ చెప్పిన విషయం తెలిసిందే. ఒక టాస్కులో అయితే మోడల్ జెస్సీ మైండ్ యువర్ వోన్ బిసినెస్ అనే ట్యాగ్ ఇచ్చిన విషయం కూడా తెలిసిందే.
హౌస్‌లో ఎంతో ఫ్రాంక్‌గా ఉంటూ ఎవరి గురించైనా వారితోనే చెప్పే శ్వేత.. రవి గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారమే రేపాయి. ‘యాంకర్ రవికి దూరంగా ఉండాలి. అతనిపై నాకు నిజంగా మంచి ఒపీనియన్ లేదు’ అనేంతగా వారి మధ్య ఏం జరిగింది. శ్వేతను ఎవరైనా ఒక మాట అంటే తను తట్టుకోలేదు. అలాంటిది రవి శ్వేతను టాస్కులో బుక్ చేశాడు. వాళ్లు కెప్టెన్ అయ్యే ఛాన్స్ లేకుండా చేశాడు. ‘బిగ్ బాస్ బొమ్మల ఫ్యాక్టరీ’ టాస్కులో రవి మాటలు విని శ్వేత ఇంట్లోని కుషన్‌ని కట్ చేసి ఫర్ తీసుకుంది. ఆ తర్వాత అది తప్పని తెలిసిన తర్వాత శ్వేత ఎంతో కోపం తెచ్చుకుంది. నాగార్జునతో కూడా రవి తన స్టేట్‌మెంట్ మార్చుకున్నాడు అని చెప్పుకొచ్చింది. యాంకర్ రవికి మాత్రం ఈ బిగ్‌బాస్ చాలానే నెగెటివ్ తెచ్చిపెడుతోందని అభిమానులు భావిస్తున్నారు. రవి నిజంగానే నటిస్తున్నాడా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.