సోమవారం అనగానే ‘బిగ్ బాస్ 5 తెలుగు’ అభిమానుల్లో ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. ఎందుకంటే ఏ రోజు ఎలాగున్నా.. సోమవారం మాత్రం అందరూ నిజాలే మాట్లాడుతారు. ఎందుకంటే అది నామినేషన్ జరిగే రోజు కాబట్టి. ఎప్పుడూ నామినేషన్ ప్రక్రియను బిగ్ బాస్ చాలా ఇంట్రస్టింగ్‌గా ప్లాన్ చేస్తాడు. గతవారం చెత్త బ్యాగులతో నామినేట్ చేసినట్లు ఈ వారం రంగు కాన్సెప్ట్‌ను తీసుకొచ్చాడు. సభ్యులందరినీ రెండు గ్రూపులుగా విడగొట్టి ఒక బృందంలోని సభ్యులు మరో బృందంలోని సభ్యులను నామినేట్ చేశారు. అన్నిటి కంటే ఈ వారం నామినేషన్లు చాలా ఆసక్తికరంగా ఉండబోతున్నాయి. ఎందుకంటే కూల్ శ్వేత ఇప్పుడు ఫైర్ శ్వేతగా మారిపోయింది.
గత వారంలో చాలా కూల్‌గా చాలా పొదుపుగా కనిపించి.. ఉందో? లేదో? అన్న అనుమానాలు కలిగించిన శ్వేత ఒక్కసారిగా ఫైర్ బ్రాండ్ అవతారం ఎత్తేసింది. మొత్తం ఇచ్చిపడేసింది. ఈ దెబ్బతో అభిమానులే కాదు.. హౌస్ సభ్యులు కూడా పిచ్చ షాక్‌లో ఉండిపోయారు. శ్వేత లోబో, హమీదాని నామినేట్ చేసింది. లోబోకి చెప్పిన కారణం అతను జెన్యూన్‌గా లేడు, ఆర్జే కాజల్ లేనపుడు ఆమె గురించి మాట్లాడుతున్నాడు అని ఆరోపించింది. లోబో నాకు నీ ఫ్రెండ్‌షిప్ బ్యాండ్ అక్కర్లేదని విసిరేసింది. మరోవైపు హమీదాకి గట్టిగా ఇచ్చేసింది. సెట్ శ్వేతా లేదా? ఏం ఇచ్చిపడేయాలి నీకు.. లెట్ మీ టాక్ వెన్ ఐయామ్ టాకింగ్ అన్న ఒక్క డైలాగ్ ఏదైతో ఉందో.. మొత్తం హౌస్ మొత్తం షాక్‌లో నిశబ్ధంగా ఉండిపోయారు.
లోబో, రవి మంచి మిత్రులు, దోస్త్ మేరా దోస్త్. అవన్నీ నిన్నటి వరకు ఇవాళ్టి కెల్లి మరో లెక్క అంటుండు మన లోబో. హౌస్‌లో దగడ్ లోబో అంటూ చాలా సీరియస్ అయ్యాడు. అందుకు కారణం రవి రెండు మూడుసార్లు లోబోని కామెంట్ చేయడమే కావచ్చు. విశ్వ ఉమాదేవిని నామినేట్ చేయడం మరో అద్భుతం. నామినేషన్ వరకు ఓకేగానీ వెంటనే ఉమాదేవి సెన్సార్ కట్ డైలాగులతో రెచ్చిపోయింది. పాపం షణ్ముఖ్ నోరు నొక్కుకుని అలా ఉండిపోయాడు. ఏది ఏమైనా ఈ నామినేషన్స్ మాత్రం మోస్ట్ అవైటెడ్ ఎపిసోడ్‌గా యూట్యూబ్‌లో కామెంట్లతో సంబరపడిపోతున్నారు.
‘బిగ్ బాస్ 5 తెలుగు’ లేటెస్ట్ అప్‌డేట్స్, గాసిప్స్, ఎలిమినేషన్స్, నామినేషన్స్ వంటి సరైన సమాచారం కోసం సుమన్ టీవీ వెబ్‌సైట్‌ని చూస్తూ ఉండండి.