‘బిగ్ బాస్ 5 తెలుగు’ హౌస్ మొత్తం ఎమోషనల్ దృశ్యాలతో నిండిపోయింది. హౌస్ లోని సభ్యుల ఫ్యామిలీ మెంబర్స్ వస్తూ ఇంట్లో జోష్ నింపుతున్నారు. అందులో భాగంగా సిరి కోసం వచ్చిన తల్లితో షణ్ముఖ్- సిరి ఇద్దరికి ఒక వింత అనుభవం ఎదురైంది. నువ్వు షణ్ముఖ్ ని హగ్ చేసుకోవడం నాకు నచ్చడంలేదని చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం వైరల్ అవుతున్నాయి. ఆ సమయంలో ఒక తల్లిగా ఆమె ఒపీనియన్ ను వ్యక్త పరిచింది. ఆ సమయంలో సిరి ఆమె తల్లిపై సీరియస్ అవ్వడం కూడా కాస్త చర్చనీయాంసంగా మారింది. సిరి- షణ్ముఖ్ రిలేషన్ పై చాలా రోజులుగా వస్తున్న వార్తలు ఇప్పుడు ఇంకాస్త ఎక్కువయ్యాయి. ఒకవేళ అలాంటి వార్తలు చూసే ఆమె తల్లి అలా స్పందించి ఉండచ్చు. కానీ, ఆ మాటల వల్ల వారి పరువు దాదాపు పోయినంత పనైంది.
ఇదీ చదవండి: బిగ్ బాస్ హౌస్ ని షేక్ చేస్తున్న సన్నీ క్రేజ్! విన్నర్ కాబోతున్నాడా?
సిరి తల్లి మాటలకు షణ్ముఖ్ నోట మాట రాలేదు. అలాగే చూస్తు ఉండిపోయాడు. ఇంట్లోని సభ్యులు కూడా ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక అలా చూస్తుండిపోయారు. సిరి తల్లి ఆ మాటలను మూడు నాలుగు సార్లు అన్నారు. ఎందుకంటే ఆమె అంత బాధ పడి ఉండవచ్చు. తన కూతురి గురించి బయట అలాంటి మాటలు విన్నందుకు. అయితే బయట వెళ్లబోయే సమయంలో సిరి తల్లి మళ్లీ అలా అనడంతో సన్నీ మాట్లాడాడు. ‘మీరు తప్పుకో అనుకోకండి. వాళ్లిద్దరూ మంచి ఫ్రెండ్స్. నేను, మానస్ ఎలానో వాళ్లిద్దరూ మంచి ఫ్రెండ్స్. ఒకరంటే ఒకరికి ఎంతో కేరింగ్. చాలా బాగా ఉంటారు’ అంటూ సన్నీ సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు. పోనీలే ఒక్కరైనా సమర్థించారు అని ఊపిరి పీల్చుకున్నట్లు సిరి కనిపించింది.
లక్షలు, కోట్ల మంది ప్రేక్షకులు, ఇంట్లోని సభ్యులు అందరూ చూస్తుండగా హగ్ ప్రస్తావన రావడం అంటే దాదాపు వారిద్దరి పరువు పోయినంత పనే. అలాంటి సమయంలో షణ్ముఖ్ సైతం నోరు మెదపలేని పరిస్థితి. అలాంటి పరిస్థితిలో షణ్ముఖ్- సిరిలకు సపోర్ట్ చేస్తూ సన్నీ మాట్లాడి.. వారి పరువును కాపాడాడు. సోషల్ మీడియాలోనూ సన్నీ రియాక్ట్ అయిన తీరును అందరూ ప్రశంసిస్తున్నారు. ద టీజ్ సన్నీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.