‘బిగ్ బాస్ 5 తెలుగు’ హౌస్ లో టికెట్ టూ ఫినాలే హీట్ నడుస్తోంది. కంటెస్టెంట్లు అందరూ తమ బెస్ట్ ఇచ్చారు. కానీ, నలుగురు మాత్రమే లాస్ట్ టాస్కుకు చేరుకోగలిగారు. సిరి, శ్రీరామచంద్ర, సన్నీ, మానస్ లు లాస్ట్ టాస్కులో పోటీపడుతున్నారు.
అయితే హౌస్ లో ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్న విషయం శ్రీరామ్- సన్నీ ఫ్రెండ్ షిప్. సోషల్ మీడియాలో వీరి ఫొటోలు బాగా వైరల్ అవుతున్నాయి. అయితే వీళ్లు ఇంతలా కలిసిపోవడం చూసి కొందరు ఈర్ష్య పడటం కూడా చూశాం. ప్రస్తుతం సరైన ఫ్రెండ్ లేక హౌస్ లో శ్రీరామ్ లోన్లీగా ఉన్నాడు. అలాంటి శ్రీరామ్ కు మంచి ఫ్రెండ్ గా సన్నీ చేస్తున్న సపోర్ట్ అంతా ఇంతా కాదు. అదే సమయంలో సన్నీకి కూడా బయట పాజిటివ్ టాక్ బాగా వస్తోంది.
ఒకప్పుడు పాము- ముంగిసల్లా ఉన్న వీళ్లు ఇప్పుడు ఇంతలా కలిసిపోవడం చూసి అందరూ ఆనందపడుతున్నారు. ప్రియాంక సింగ్ చేసిన పనికి శ్రీరామచంద్ర మంచానికే పరిమితమయ్యాడు. ఆ సమయంలో శ్రీరామ్ ను బయటకు లోనికి తిప్పడమే కాకుండా శ్రీరామ్ కోసం గేమ్ ఆడి గెలిపించి అతడిని లాస్ట్ టాస్కు దాకా తీసుకొచ్చింది సన్నీనే.
ఫ్రెండ్ షిప్ అనగానే సన్నీ ఎంతలా ఇన్వాల్వ్ అవుతాడో గతంలోనూ చూశాం. ఇప్పుడు శ్రీరామ్- సన్నీల మధ్య ఒక స్పెషల్ బాండ్ అనేది ఏర్పడిందనే చెప్పాలి. మరోవైపు సన్నీకి కాజల్ కు మధ్య చెడుతున్నట్లు కూడా చూస్తున్నాం. మరి మానస్, సన్నీ, శ్రీరామ్ ఒక జట్టు అవుతారేమో చూడాలి. అదే జరిగితే వీళ్లను ఎదుర్కోవడం హౌస్ లో వాళ్లకు కష్టమే అవుతుంది.