‘బిగ్ బాస్ 5 తెలుగు’ సీజన్ లో గేమ్ ఇంట్రస్టింగా మారుతోంది. ఇంట్లోని సభ్యులు వ్యక్తిగత ఆట మొదలు పెట్టారు. గ్రూపులుగా ఉంటూనే గిల్లిగజ్జాలు పెట్టే వారు, పెట్టుకునే వారిని చూస్తున్నాం. అయితే ఆ విషయాలు పక్కనపెడితే ఈ సీజన్ లో బాగా నెగెటివిటీ మూటగట్టుకున్న జంట సిరి- షణ్ముఖ్ అనడంలో సదేహం లేదు. అయితే ఫ్యామిలీ మెంబర్స్ వచ్చిన సమయంలో ఇద్దరూ గట్టిగా చెప్పారు ఇంక అలా చేయము. మాలో మార్పును చూస్తారు.. ఇండివిడ్యువల్ గేమ్ చూస్తారని చెప్పుకొచ్చిన వీళ్లు మళ్లీ మాములే అయ్యారు. షణ్ముఖ్ అయినా కాస్త భయం, బెరుకు చూపిస్తున్నాడు గానీ, సిరి మాత్రం హగ్గు ఇవ్వు అంటూ డిమాండ్ కూడా చేస్తోంది. ఇటీవల మోజ్ రూమ్ లో అయితే బలవంతంగా హగ్ చేసుకుని వార్తల్లో నిలిచింది.
టికెట్ టూ ఫినాలే టాస్కులో పాదాలకు గాయాలయ్యి సిరి ప్రస్తుతం నడవలేని స్థితిలో ఉంది. ఇంట్లో ఉన్న ఏకైక మిత్రుడు షణ్ముఖ్ నే దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నాడు. మరి అంత సేవలు చేసుకుంటున్న ఫ్రెండ్ కి ఒక హగ్ ఇవ్వకపోతే ఎలా? అంటూ సిరి మరోసారి షణ్ముఖ్ ను హగ్ చేసుకుంది. మొన్నీ మధ్య ఇద్దరూ ఒకే బెడ్ షీట్ లో కనిపించి విమర్శలు ఎదుర్కున్న విషయం తెలిసిందే. ఈసారి మళ్లీ హగ్ చేసుకుంటూ సిరి పాస్ చేసిన స్టేట్ మెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆంటీ ఇది ఫ్రెండ్ షిప్ హగ్ మాత్రమే అంటాడు షణ్ముఖ్. అందుకు సిరి ‘మా మమ్మీకి తెలుసులే. అర్థమైపోయి ఉంటుంది. వాడికి బాలేక పోయినా.. నాకోసం పనులు చేస్తున్నాడు’ అంటూ చెప్పుకొచ్చింది. ఏదేమైనా వీరిద్దరి విషయంలో మాత్రం నెగెటివ్ కామెంట్స్ ఆగడం లేదు. వాళ్లు హగ్గులు ఆపడం లేదు.
వీరిద్దరిని చూసి ప్రియాంక సింగ్ కూడా హగ్ ఇవ్వాలంటూ షణ్ముఖ్ అడుగుతుంది. ‘సిస్టర్ హగ్ కావాలి నాకు’ అంటూ ప్రియాంక సింగ్ కోరగా.. షణ్ముఖ్ మాత్రం లైట్ తీసుకున్నాడు. సిరి- షణ్ముఖ్ హగ్గుల విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.