‘బిగ్ బాస్ 5 తెలుగు’ సీజన్ లో ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రస్తుతం టాస్కుల జోరు నడుస్తోంది. టాస్కుల మధ్యలో ఇంట్లోని సభ్యుల మధ్య రచ్చ కూడా బాగానే జరుగుతోంది. ఇవన్నీ పక్కన పెడితే ఎప్పటిలాగానే సిరి- షణ్ముఖ్ మధ్య గొడవలు, అలకలు జరుగుతూనే ఉన్నాయి. వాటన్నింటిని మించి బుధవారం జరిగిన ఎపిసోడ్ లో ప్రేక్షకులకు మతిపోయే సంఘటన ఒకటి జరిగింది.
ఇప్పటి వరకు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాం అని చెప్పుకుంటున్న సరి-షణ్ముఖ్ మధ్య నిజంగానే ప్రేమ ఉందని అర్థమైపోయింది. అది నేరుగా సిరి నోటితోనే చెప్పింది. ‘నువ్వు ఇప్పుడు చూపిస్తున్నావ్. నేను నీ మీద ఎప్పటి నుంచో చూపిస్తున్నాను. నీకు తెలీదా నువ్వు అంటే నాకు ఎంత ఇష్టమో? అది ఎప్పటికీ ఉంటుంది. నువ్వే బయటికెళ్తే అది ఉండదు అని చెప్తున్నావ్. నేను ఎప్పుడూ అలా అనలేదు. ఐ లవ్ యూరా. ఫ్రెండ్స్ అయితే ఐ లవ్ యూ చెప్పుకో కూడదా?’ అంటూ ఈ గ్యాప్ లోనే హగ్గులతో రచ్చ చేసింది.
ఇదంతా చూసిన ప్రేక్షకులు ఈ మ్యాటర్ మాకు ముందే తెలుసు. ఇదంతా కాదు కానీ, పాపం శ్రీహాన్ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇద్దరూ సింగిల్ అయితే బానే ఉండేది. బిగ్ బాస్ మరో జంటను కలిపిందని అనుకునే వాళ్లం. ఇద్దరికీ బయట ఇద్దరు ఉన్నారు. లోపల ఈ పాడు పనులు ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరు కాస్త ముందడుగేసి బుద్ధి చెబుతున్నారు. సిరి- షణ్ముఖ్ రిలేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.