‘బిగ్ బాస్ 5 తెలుగు’ సీజన్ గ్రాండ్ ఫినాలేకి ఇంకా రెండు రోజులు మాత్రమే ఉన్నాయి. టాప్-5 కంటెస్టెంట్ల కోసం అభిమానులు ఓట్లు వేస్తున్నారు. ఈ సీజన్ లో బాగా హైలెట్ అయిన విషయాల్లో సిరి- షణ్ముఖ్ రిలేషన్ కూడా ఒకటి. వీళ్ల రిలేషన్ కు సంబంధించి చాలా నెగెటివ్ టాక్ వచ్చినా కూడా.. అటు దీప్తీ సునైనా కానీ, ఇటు శ్రీహాన్ కానీ తప్పుగా మాట్లాడలేదు. కానీ, తాజాగా సిరి- షణ్ముఖ్ రిలేషన్ పై శ్రీహాన్ ఓపెన్ కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. వాళ్ల రిలేషన్ ను ఎంతగానో అర్థం చేసుకుని స్పందించాడు శ్రీహాన్. అయితే తాజాగా శ్రీహాన్ పేరు మీద కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఆ కామెంట్స్ సారాంశం ‘సిరిపై చివర్లో అంత నెగెటివిటీని ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారు? సిరి వల్ల నెగెటివ్ అవుతున్నాడు. సిరి వల్ల నెగెటివ్ అవుతున్నాడు అంటున్నారు. అసలు సిరి లేకపోతే షణ్ముఖ్ ఎప్పుడో బిగ్ బాస్ హౌస్ లో పిచ్చోడు అయ్యేవాడు. సిరి వేరే వాళ్లతో మాట్లాడితే తప్పే. వేరే వాళ్లతో డాన్సు వేసినా తప్పే. తనే ప్రపంచం అన్నట్లు క్రియేట్ చేస్తే తాను మాత్రం ఏం చేస్తుంది. ఒక ఆడపిల్ల గురించి ఇంత నెగెటివిటీ స్ప్రెడ్ చేయడం అవసరమా? పది రోజుల క్రితం నా దగ్గరికి ఒక స్క్రీన్ షాట్ వచ్చింది. కానీ, నేను ఎందుకు స్పందించలేదు. మీ మెచ్యూరిటీ ఏంటో ఇక్కడో తెలుస్తోంది’ ఆ ఇన్ స్టా స్టోరీలో ఉంది.
అసలు ఇది శ్రీహాన్ నే చేసిన కామెంట్సా? లేక పరిస్థితులను వాడుకుని ఇలా ఎవరైనా చేస్తున్నారా? అనే విషయం తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు ఎప్పుడూ ఇలా మాట్లాడని శ్రీహాన్ పేరిట ఇలాంటి కామెంట్స్ కొంత ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. శ్రీహాన్ పేరుతో వైరల్ అవుతున్న ఈ కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.