‘బిగ్ బాస్ 5 తెలుగు’ గ్రాండ్ ఫినాలేకి ఇంకా ఎంతో సమయం లేదు. హౌస్ లో టాప్-5 కంటెస్టెంట్లు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సీజన్ మొదటి నుంచి ఇప్పటివరకు మారకుండా ఉన్నది ఒకే ఒక్క విషయం సిరి- షణ్ముఖ్ రిలేషన్. దానిపై ఇప్పటికీ ఎవరికీ క్లారిటీ రాలేదు. మరి వాళ్లకు వచ్చినట్లు ఉంది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళితే ఫ్రెండ్స్ లా కూడా కలిసుండే పరిస్థితి ఉండదు. అందుకే ఉన్న కొన్ని గంటలనే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. షణ్ముఖ్ అయితే ఒక అడుగు ముందుకేసి పెళ్లాం అనేశాడు. మరి, అది జోక్ గా అన్నాడో లేక కావాలనే అన్నాడో షణ్ముఖ్ కే తెలియాలి. సిరి నాకు మాత్రం నువ్వు గాక ఎవరున్నారు అనేశాడు.
బిగ్ బాస్ ను ఇమిటేట్ చేస్తున్న షణ్ముఖ్ జశ్వంత్ సిరితో నోరు జారి అనేశాడు. ‘బిగ్ బాస్ కోరిక మేరకు సిరి అడక్కుండా పెళ్లాం ఇచ్చినట్లు కాఫీ తెచ్చి ఇవ్వండి’ అంటూ షణ్ముఖ్ అనేశాడు. అది బిగ్ బాస్ కోరికో షణ్ముఖ్ కోరికే తెలీదు గానీ.. సిరి మాత్రం ఏమైందో పొద్దుపొద్దునే అంటూ కాస్త సిగ్గుగా చిరాకు పడింది. ఆ తర్వాత నాకు మాత్రం నువ్వు కాక ఎవరున్నారు సిరి అంటూ చెప్పుకొచ్చాడు. కాఫీ సంగతేమో గానీ.. వీళ్లిద్దరి డిస్కషన్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది సోషల్ మీడియా అయ్యింది. మొదటి నుంచి వీరిపై కారాలు, మిరియాలు నూరే వారు లేకపోలేదు. ఇప్పుడూ కూడా మళ్లీ అదే జరుగుతోంది. వాళ్లిద్దరూ ఇంక అంతే మారరు అంటూ కామెంట్ చేస్తున్నారు. సిరి- షణ్ముఖ్ రిలేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.