‘బిగ్ బాస్ 5 తెలుగు’ సీజన్ దాదాపు ముగింపు దశకు చేరుకుంది. ఇంట్లో ఏడుగురు సభ్యులు మాత్రమే ఉన్నారు. టికెట్ టూ ఫినాలే టాస్కులు కూడా కొనసాగుతున్నాయి. టాప్ 5లో ఎవరుంటారన్నదే ఇప్పుడు అంతటా చర్చ. అయితే సీజన్ మొదటి నుంచి కాజల్ ఒక్కతే నెగెటివ్ ఇంప్రెషన్ ను కొనసాగిస్తోంది. 13వ వారంలోనూ ఇంకా కాజల్ పై విమర్శలు, ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. మరి, వాటిలో నిజం ఎంతుంది? లేదా హౌస్ మేట్స్ కాజల్ ను టార్గెట్ చేశారా? పరిశీలిద్దాం.
ఎన్నో ఆశలతో బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన ఆర్జే కాజల్ మొదటి నుంచి ఇంట్లోని సభ్యులను ఇంప్రెస్ చేయలేకపోయింది. ఇప్పటికీ ఆమంటే పడటం లేదు. కాజల్ ను చూస్తుంటే నాకు నెగెటివ్ వైబ్స్ వస్తాయంటూ యానీ మాస్టర్ చెప్పడం. ఎందుకో నేను నీతో కనెక్ట్ అవ్వలేకపోయాను అంటూ ప్రియ అనడం. నువ్వు ఇంట్లో నుంచి వెళ్లిపోతే గొడవలు తగ్గుతాయేమో? అని షణ్ముఖ్ రెండోసారి చెప్పడం. ప్రియాంక కూడా కాజల్ ఎక్కడుంటే అక్కడ గొడవలు జరుగుతాయనడం.. చూస్తుంటే నిజంగానే కాజల్ అంత నెగెటివ్ గా చేస్తోందా? అనే అనుమానం అందరికీ వస్తోంది.
నిజంగానే కాజల్ అంత నెగెటివ్ గా ఉంటే.. మరి మానస్- సన్నీ ఎలా కనెక్ట్ అవుతున్నారు అనేది ప్రశ్న. ఫ్రెండ్ కోసం కాజల్ ఏదైనా చేస్తుంది అని ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్కులో చూశాం. సన్నీకి పాస్ దక్కేలా చేయాలని కాజల్ ఎంతో కష్టపడింది. ఇంట్లోని సభ్యులతో మాటలు కూడా పడింది. అంటే కాజల్ స్నేహానికి మంచి ప్రియారిటీ ఇస్తుంది. అయితే చాలా మంది మానస్- సన్నీ తరహాలో కనెక్ట్ కాలేకపోయారు. మేబీ ఆమె స్ట్రాటజీలు నచ్చకపోవచ్చు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే కాజల్ టార్గెట్ అయినట్లే కనిపిస్తోంది. ప్రియాంక మాత్రం మానస్ కు తనకు కాజల్ అడ్డుగా ఉందనే భావిస్తోంది. చూసిన ఎపిసోడ్స్ లో మాత్రం కాజల్ చాలా సందర్భాల్లో మానస్.. ప్రియాంకతో మాట్లాడేలా ట్రై చేసినట్లు చూశాం. మానస్ తో ప్రియాంక గురించి చాలా పాజిటివ్ గా చెప్పింది. మాట్లాడాల్సిందిగా చాలా సార్లు కోరింది. కానీ ప్రియాంక మాత్రం తప్పుగానే అర్థం చేసుకుంది.
పరిస్థితులకు తగ్గట్లు బిగ్ బాస్ కంటెస్టెంట్లు నిర్ణయాలు తీసుకుంటారని అందరికీ తెలిసిందే. కాజల్‌పై వస్తున్న నెగెటివ్ గా ఆమె కనిపించిన సందర్భాలు చాలా తక్కువ. కానీ, షణ్ముఖ్ నామినేషన్స్ లోనూ కాజల్ వెళ్లిపోతే గొడవలు తగ్గుతాయనడం చర్చకు దారి తీసింది. కాజల్ వల్లే బిగ్ బాస్ హౌస్ లో గొడవలు జరుగుతున్నాయా? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.