‘బిగ్ బాస్ 5 తెలుగు’ సీజన్ గ్రాండ్ ఫినాలేకి ఇంకా కొన్ని రోజుల దూరంలో ఉంది. ఈ వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారు? అనే విషయంపై ప్రేక్షకులు చాలా కసరత్తు చేస్తున్నారు. వారికి నచ్చని కంటెస్టెంట్ ఎలిమినేట్ కావాలని కొందరు కోరుకుంటుంటే.. గేమ్ పరంగా ఎవరు ఎలిమినేట్ అవుతారు అని ఇంకొందరు అంచనాలు వేస్తున్నారు. అయితే ఉన్న ఆరుగురిలో ఒకళ్లు ఎలిమినేట్ అవ్వాలి అంటే సోషల్ మీడియాలో చాలా మంది ఆర్జే కాజల్ ఎలిమినేట్ అవుతుందని భావిస్తున్నారు. ఫాలోయింగ్, గేమ్, టాస్కుల పరంగా చూసుకుంటే కాజలే డల్ గా ఉందనే భావనకు వచ్చేస్తున్నారు.
గత రెండు వారాలుగా కాజల్ కాస్త యాక్టివ్ గా ఉంది. ఇప్పటివరకు అంత యాక్టివ్ పర్ఫార్మర్ కాదని కామెంట్ చేస్తున్నారు. ఫ్యాన్ బేస్ పరంగానూ అంత బాగా లేదనేది భావన. ఉన్న ఆరుగురిలో టాప్-5 అంటే కాజల్ నంబర్ 6 అనే చెప్తున్నారు. సిరికి కాజల్ పోటీ ఇవ్వలేదని.. టాస్కుల పరంగా సిరినే బెస్ట్ అంటున్నారు. ఇంక కొన్ని అనధికారిక లెక్కల ప్రకారం కూడా కాజల్ కే తక్కువ ఓట్లు పడుతున్నాయి. అలా చూసినా కూడా కాజల్ కు ఆదరణ తగ్గిందనే చెప్పుకోవచ్చు.
ఓట్ అప్పీల్ కూడా అంత ప్రభావం చూపలేదనేది టాక్. ఏది ఏమైనా మానస్, సన్నీల బెస్ట్ ఫ్రెండ్ హౌస్ నుంచి ఎలిమినేట్ కావడం పక్కా అంటూ చెబుతున్నారు. అదే జరిగితే టాప్-5లోకి సిరి ఎంటర్ అయిపోయినట్లే. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నల్లోనూ సిరికి పాజిటివ్ రెస్పాన్స్ కనిపిచింది. సో ఆ విధంగా ఈసారి మాత్రం ఆర్జే కాజల్ ఎలిమినేట్ కావడం పక్కా అంటూ బల్ల గుద్ది చెప్తున్నారు. అధికారికంగా ఆ ప్రశ్నకు సమాధానం కావాలంటే ఆదివారం బిగ్ బాస్ ఎపిసోడ్ దాకా ఆగాల్సిందే. మరి, కాజల్ ఎలిమినేట్ అవుతుందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.