‘బిగ్ బాస్ 5 తెలుగు’ చివరి వారంలోకి వచ్చేసింది. టాప్ 5 కంటెస్టెంట్లు ఎవరో తెలిసిపోయింది. 14వ వారం హౌస్ నుంచి ఆర్జే కాజల్ ఎలిమినేట్ అయ్యింది. సన్నీ- మానస్ లు కాజల్ ఇలా ఎలిమినేట్ అవ్వుద్దని ఊహించలేదు. హౌస్ బయటకు వచ్చిన తర్వాత కాజల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
‘నాకు ఓటు వేసి ఇక్కడి వరకు తీసుకొచ్చిన అందరికీ నా ధన్యవాదాలు. బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన వెంటనే నా డ్రీమ్ ఫుల్ ఫిల్ అయ్యింది. నేను ఇక్కడి దాకా వచ్చానంటే నా అదృష్టమే. బిగ్ బాస్ హౌస్ నాకు ఇద్దరు బ్రదర్స్ ను ఇచ్చింది. ఒకడు ఏడిపిస్తే ఇంకొకడు ఓదారుస్తాడు. నేను అందరితో కనెక్ట్ కాలేకపోయాను. రవి నేను మంచి ఫ్రెండ్స్ బయట.. కానీ, హౌస్ లో కనెక్ట్ కాలేకపోయాం దానిక పెద్ద కథ ఉంది. నాగార్జున హోస్టింగ్ మిగిలిన సీజన్స్ కన్నా నాకు బాగా నచ్చింది. ఆయన నాకు పర్సనల్ గా కూడా ఇంటరాక్షన్ ఉంది కాబట్టి.. నాకు బాగా నచ్చింది’ అంటూ చెప్పుకొచ్చింది.
సిరి– షణ్ముఖ్ హగ్స్ గురించి ప్రశ్నరించగా.. ‘సిరి- షణ్ముఖ్ సెపరేట్ జోన్ లో ఉంటారు. మేమెప్పుడూ ఆ జోన్ లోకి వెళ్లలేదు. సిరి మదర్ వచ్చినప్పుడు హగ్స్ గురించి ప్రస్తావించగా.. ఫ్యామిలీని మిస్ అవుతూ ఆ ఫ్రెండ్లీ బాండ్, టచ్ కావాలనుకుని వాళ్లు అలా ఫ్రెండ్లీ హగ్ చేసుకున్నారు అనే అనిపించింది. వాళ్లిద్దరి మధ్య ఏముందనేది మేము పట్టించుకోలేదు. హౌస్ మేట్స్ కూడా ఎవరూ తప్పుగా తీసుకోలేదు. హౌస్ లో హగ్గుల గురించి డిస్కషన్ చేయలేదు’ అంటూ తెలిపింది.
కాజల్ చెప్పిన సమాధానం ఆమెను ఇంతకాలం హేట్ చేసిన సిరి- షణ్ముఖ్ ఫ్యాన్స్ కు షాకిచ్చి ఉంటుందని అనుకుంటున్నారు. కాజల్ కామెంట్స్ ఎంతో మెచ్యూర్డ్ గా ఉన్నాయంటూ ప్రశంసిస్తున్నారు. బిగ్ బాస్ 5 తెలుగు సీజన్ విన్నర్ ఎవరు అవుతారని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.