‘బిగ్ బాస్ 5 తెలుగు’ సీజన్ ఫినాలే దగ్గరపడుతుండటంతో ఆట ఇంకా రసవత్తరంగా సాగుతోంది. ఇంతకాలం అందరూ ఫ్రెండ్స్, గ్రూప్స్ గా ఉన్నారు. కానీ, విన్నర్ ఒకళ్లే అవుతారు కాబట్టి ఇప్పటి నుంచి ఇండివిడ్యువల్ గేమ్ స్టార్ట్ చేసినట్లుగా కనిపిస్తోంది. లోపల సంగతి పక్కన పెడితే బయట ఫ్యాన్స్ మాత్రం ఆల్రెడీ ఆ గేమ్ స్టార్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇంతకాలం సపోర్ట్ చేసుకున్న వాళ్లు కూడా ఇప్పుడు వార్ స్టార్ట్ చేసినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా కాజల్ ఫ్యాన్స్, సన్నీ ఫ్యాన్స్ కు పడటం లేదని టాక్. కాజల్ కు సంబంధించిన పోస్టుల్లోనూ సన్నీ సపోర్ట్ తోనే సర్వైవ్ అవుతున్నావ్ అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు.
సన్నీ సపోర్ట్ లేనిదే కాజల్ ఇంతకాలం హౌస్ లో ఉండేది కాదు. అందుకే సన్నీతో ఫ్రెండ్ షిప్ చేస్తోంది అని ఆరోపిస్తున్నారు. హౌస్ లోనూ ఇదే టాక్ వినిపిస్తోంది. ప్రియాంక సింగ్ తో మాట్లాడుతున్న సందర్భంలో.. ఈ వారం సన్నీ నామినేషన్స్ లో లేనందున ఆ ఫ్యాన్స్ బేస్ కాజల్ కు సపోర్ట్ చేస్తారు’ అనుమానాన్ని వ్యక్తం చేశాడు. కానీ, బయట పరిస్థితి అలా కనిపించడం లేదు. ఇంత కాలం కాజల్ కు సపోర్ట్ చేసిన సన్నీ ఫ్యాన్స్ మాత్రం ఇక నుంచి తమ దారి తాము చూసుకోవడానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కాజల్ కు రవి కంటే ఎక్కువ ఓట్స్ వచ్చి సేవ్ అయిన సందర్భంలోనూ ఇలాంటి టాక్ వినిపించింది. సన్నీ సపోర్ట్ ఎక్కువ ఉందని. మరి సన్నీ ఫ్యాన్స్ నిజంగానే ఆ డెసిషన్ తీసుకుంటే కాజల్ కొనసాగడం కష్టమే అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. కాజల్ నిజంగానే సన్నీ ఫ్యాన్ బేస్ తో సర్వైవ్ అవుతోందా? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.