సాధించే తిరిగొస్తానంటూ ‘బిగ్ బాస్ 5 తెలుగు’లో అడుగుపెట్టాడు నటరాజ్ మాస్టర్. తన భార్య కోరిక మేరకు.. గర్భవతి అయినా ఆమెను వదిలేసి బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చాడు మాస్టర్. మొత్తం నాలుగు వారాలకుపైగా హౌస్‌లో ఉన్న మాస్టర్ చేసిన పనులు, తప్పులు, అసలు ఆయన ఎలిమినేట్ అవ్వడానికి గల అసలు కారణాలు ఏంటో చూద్దాం.
బిగ్ బాస్ హౌస్‌లో కొనసాగాలంటే కొన్నిసార్లు కాకపోతే కొన్నిసార్లైనా ఇంటి సభ్యులతో కలివిడిగా ఉండాలి. అలా ఉండలేకపోయినా.. కనీసం నటించాలి. అందులో నటరాజ్ మాస్టర్ ఫెయిల్ అయ్యాడు. హౌస్‌లో కొనసాగాలంటే బయట ఎంత ఫాలోయింగ్ ఉన్నాకూడా ఇంట్లో సపోర్ట్ ఉండాలి. ఇది ఇండివిడ్యుల్ గేమ్ అయినా కూడా లోపల సపోర్ట్ చాలా అవసరం. నేను మాస్టర్ అందరికంటే పెద్ద అన్న ఫీలింగ్ చాలా సందర్భాల్లో కనిపించింది. అది కూడా అందరితో కలవలేకుండా చేసిందని అనుకోవచ్చు.
ఇవి కూడా చదవండి: ఈసారి నామినేషన్స్ లోకి షణ్ముఖ్.. ఈ వారం నామినేషన్స్ లో ఉన్నది వీళ్లే!
రెండోసారి వరస్ట్ పెర్ఫార్మర్ గా జెస్సీ.. కావాలనే ఇలా చేస్తున్నారా?
నటరాజ్ మాస్టర్ హౌస్‌లో అందరినీ జంతువులతో ఎందుకు పోల్చారో ఎవరికీ తెలీదు. వారి ప్రవర్తనను జడ్జి చేయకుండా ఉంటే బావుండేదేమో. రవిని గుంటనక్క అంటూ, విశ్వని ఊసరవెల్లి అని నామకరణాలు చేయడం కూడా బాగా నెగెటివ్ పబ్లిసిటీకి తావిచ్చింది. రవి ఎన్నిసార్లు వెళ్లి అడిగినా చెప్పకపోవడం.. అడిగిన ప్రతిసారి వింతగా నవ్వడం ఎవ్వరికీ నచ్చలేదు. విశ్వతో గొడవకు దిగడం బాగా మైనస్ అయ్యాయి. తామకి ఇష్టం లేకపోయినా వారిని జడ్జి చేసి తన అభిప్రాయాలను ప్రేక్షకుల అభిప్రాయాలు అన్నట్లు వారిని జంతువులతో పోల్చడం ఇంట్లోని సభ్యులు అంగీకరించలేదు. చాలా మంది మాస్టర్ ప్రవర్తన గురించి బాహాటంగానే అసహనం వ్యక్తం చేశారు.
బిగ్ బాస్ హౌస్‌లో దాదాపు నామినేషన్స్‌లో నటరాజ్ మాస్టర్ అన్నిసార్లు వచ్చారు. ఆయన్ను నామినేట్ చేసినవాళ్లను టార్గెట్ చేయడం కొంత దెబ్బతీసింది. అందరూ అతడ్ని టార్గెట్ చేశారని.. కావాలనే అంతా కలిసి తనను నామినేట్ చేస్తున్నారనే భావనలో గడిపారు మాస్టర్. ఇద్దరు ముగ్గురు కలిసి నన్ను నామినేట్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. వారిని టార్గెట్ చేసి మాట్లాడడం.. జెస్సీ చిన్నపిల్లాడు అంటూ కామెంట్ చేయడం. ‘సింహంతో వేట.. నాతో ఆట’ రెండూ డేంజర్ అంటూ సినిమా డైలాగులు చెప్పడం కూడా మాస్టర్‌కు బాగా మైనస్ అయ్యాయి.
ఇప్పటి వరకు హౌస్ నుంచి మొదటివారం సరయు, రెండోవారం ఉమాదేవి, మూడోవారం లహరి షేరి ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం కూడా లేడీని ఎలిమినేట్ చేస్తే బయట జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేసినట్లు అవుతుందని భావించి నటరాజ్ మాస్టర్‌ను ఎలిమినేట్ చేశారని టాక్ నడుస్తోంది. కొన్ని సందర్భాల్లో యానీ మాస్టర్ లాంటి వారు ‘మేము వీక్‌గా ఉన్నాం.. ఇప్పటివరకు అమ్మాయిలు మాత్రమే ఎలిమినేట్ అయ్యారు’ అని చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు కారణం కావచ్చు.
‘బిగ్ బాస్ 5 తెలుగు’ లేటెస్ట్ అప్‌డేట్స్, గాసిప్స్, ఎలిమినేషన్స్ వంటి ఆసక్తికర కథనాల కోసం సుమన్ టీవీ వెబ్‌సైట్‌ను చూస్తుండండి.
ఇవి కూడా చదవండి: 2017లో దుబాయ్‌లో స్టోర్ కీపర్.. ఇప్పుడు CSKలో పేస్ బౌలర్.. ఇన్స్‌పైరింగ్ స్టోరీ!
ఆ వీడీయో చూసి కన్నీరు పెట్టుకున్న యాంకర్ రష్మి!