‘బిగ్ బాస్ 5 తెలుగు’ సీజన్ ఇంకా కొన్ని రోజులే ఉంది. బిగ్ బాస్ 5 టైటిల్ విన్నర్ ఎవరు అవుతారా అని ప్రేక్షకులే కాదు.. గత సీజన్లలో పాల్గొన్న కంటెస్టెంట్లు సైతం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం వారి వారి అభిమాన కంటెస్టెంట్లకు మద్దతు పలుకుతూ సెలబ్రిటీలు కూడా పోస్టులు పెడుతున్నారు. అయితే ఇప్పుడు బిగ్ బాస్ 4 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్, అషూరెడ్డి కూడా తమ అభిమాన కంటెస్టెంట్ ఎవరో చెప్పేశారు. అతనిలో వారికి నచ్చిన క్వాలిటీని కూడా చెప్పారు. ఆ కంటెస్టెంట్ ఎవరో కాదు వీజే సన్నీ. అవును వీజే సన్నీకి ప్రస్తుతం చాలా మద్దతు లభిస్తోంది.
‘ఎవరైతే మాస్క్ లేకుండా నిజంగా ఉన్నాడో.. ఎవరైతే అన్ని సందర్భాల్లో తన నిజమైన ఎమోషన్స్ ను చూపిస్తాడో. ప్రేక్షకులను ఎవరైతే పాజిటివ్ వేలో ఎంటర్ టైన్ చేస్తాడో అతనికే నా ఓటు. అతనే వీజే సన్నీ’ అంటూ రాహుల్ సిప్లిగంజ్ పోస్ట్ చేశాడు. అషు రెడ్డి కూడా సేమ్ అదే కొటేషన్ తో తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. మరి, బిగ్ బాస్ హౌస్ లో మీరు ఏ కంటెస్టెంట్ కు సపోర్ట్ చేస్తున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.