బాలీవుడ్ లో సంచలనాలు సృష్టించిన బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ ఇతర భాషల్లో కూడా తెగ సందడి చేస్తుంది. తెలుగు లో బిగ్ బాస్ సీజన్ 1 కి ఎన్టీఆర్.. సీజన్ 2 కి నాని హూస్ట్ గా వ్యవహరించగా.. మూడో సీజన్ నుంచి ప్రస్తుతం ఐదో సీజన్ కి కింగ్ నాగార్జున హూస్ట్ గా కొనసాగుతున్నారు. బిగ్ బాస్ నాలుగు సీజన్లను రికార్డు స్థాయి రేటింగ్‌తో సక్సెస్ చేసుకుంది. ఈ క్రమంలోనే ఐదోది కూడా ఇటీవలే మొదలైంది.
ఈ సీజన్ ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగుతోంది. ఈసారి బిగ్ బాస్ లోకి 19 మంది ఇంటి సభ్యులు ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికే ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. బిగ్ బాస్ 5 తెలుగులో రచ్చ రోజు రోజుకూ పెరుగుతోంది. నామినేషన్స్ రోజు హౌస్ అంతా హాట్ హాట్ గా మారుతోంది. మూడో వారం ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా రెండు రోజుల పాటు నామినేషన్ ప్రక్రియ రచ్చ రచ్చగా మారింది. ముఖ్యంగా ప్రియ-లహరి-రవి మధ్య బిగ్ ఫైట్ నడిచింది. తిట్లు.. ఏడుపులు.. హగ్ లు.. సారీలతో రొటీన్ గా రెండు రోజుల డ్రామా కొనసాగింది. ఈ ఎపిసోడ్ లో లహరికి ప్రియాంక మనస్ఫూర్తిగా సారీ చెప్పడంతో గొడవ సర్ధుమణిగింది.
ఇదిలా ఉంటే.. ఈ సారి సీజన్‌లోకి 9 మంది మగ కంటెస్టెంట్లు, 9 మంది ఆడ కంటెస్టెంట్లు రాగా.. ప్రియాంక సింగ్ మాత్రం ట్రాన్స్‌జెండర్ కేటగిరీలో ఎంట్రీ ఇచ్చింది. గతంలో తమన్నా కూడా ఇలాగే ప్రవేశించినా.. తన వివాదాస్పద తీరుతో విమర్శల పాలైంది. ప్రస్తుతం ప్రియాంక సింగ్ (పింకి) ఇంటి సభ్యులతో కలిసి అన్ని విషయాల్లో బెస్ట్ అనిపించుకుంటుంది. చక్కని కట్టుబొట్టుతో ఆడవాళ్లే కుళ్లుకునేంత అందంగా తయారవడంతో పాటు హుందాగా వ్యవహరిస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి ఆమెకు భారీ స్థాయిలో మద్దతు కూడా లభిస్తూ వస్తోంది.
తాజా ఎపిసోడ్‌లో ప్రియాంక, లోబో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని సంచలన కామెంట్స్ చేసింది… నేను నిన్న సాయంత్ర హాఫ్ ఫిట్ డ్రెస్ వేసుకున్నాను. అది నాకు కంఫర్ట్‌గా అనిపించలేదు. నాకు తెలుసు అది కాస్త ఇబ్బందిగానే ఉందని.. అందుకే నాకు వీలైనంత వరకూ కవర్ చేసుకుంటూనే ఉన్నాను. నేను ఎవరితోనో ఏదో మాట్లాడుతూ ఉంటే లోబో నాకు రెండు మూడు సార్లు సైగ చేశాడు. అప్పుడు సీన్ అర్థమై మరింత జాగ్రత్తగా ఉన్నాను. నా కవరింగ్ నేను చేసుకుంటున్నాను. అంతలో సడన్‌గా వచ్చి చేయి పెట్టాడు. దాన్ని నేను ఫన్నీగానే తీసుకున్నాను, కానీ వెంటనే డ్రెస్ మార్చేసుకున్నాను’ అని సంచలన ఆరోపణలు చేసింది.
అయితే ఈ విషయం ప్రియాంక ఈ విషయాన్ని కాజల్, సిరికి చెప్పడంతో వాళ్లు సీరియస్ అయ్యారు.. ఇంకోసారి ఇలా చేయకు అని లోబోకు సీరియస్ వార్నింగ్ ఇవ్వాల్సిందని కాజల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక ఈ విషయాన్ని రవికి చెబుదామా అని ప్రియాంకతో సిరి అనడంతో ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేద్దాం అన్నది. ట్విస్ట్ ఏంటేంటే ఈ డిస్కర్షన్ జరిగిన కొద్ది సేపటికే లోబో వచ్చి పింకిని హగ్ చేసుకుంటాడు. దీంతో ఈ గొడవ సర్ధుమణిగినట్లైంది.