‘బిగ్ బాస్ 5 తెలుగు’ హౌస్ లో కొత్త కెప్టెన్ గా వీజే సన్నీ అయ్యాడు. కెప్టెన్ కావాలి అన్న అతని కల నెరవేరింది. అందుకు సహకరించిన యానీ మాస్టర్‌ను గట్టిగా హగ్ చేసుకుని ముద్దు పెట్టి అతని సంతోషాన్ని తెలిపాడు. కెప్టెన్సీ టాస్క్‌లో కాజల్, రవికి మధ్య చిన్న వివాదం కూడా మొదలైంది. అది ఎప్పుడు సమసి పోతుంది అన్నది తెలీదు గానీ.. ప్రస్తుతం అయితే కొనసాగుతోంది. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నదానిపైనే అందరి ఆసక్తి. మరోవైపు కోపంతో ఊగిపోతూ గొడవలు పడిన ప్రియ, సన్నీ ఇప్పుడు నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు. మీకు ఏ డిపార్ట్‌మెంట్ కావాలని ప్రియను అడుగుతాడు సన్నీ. అలా వారి మధ్య ప్రస్తుతానికైతే గొడవలు లేవు. నామినేషన్ రోజు ఏమైద్దో చూడాలి.
ఇదీ చదివేయండి: అంచనాలను పెంచేస్తున్న రాధే శ్యామ్ టీజర్!
మరోవైపు గేమ్ కొనసాగుతున్న కొద్దీ వారివారి అభిమాన కంటెస్టెంట్ల కోసం బయట ప్రచారాలు చేస్తుంటారు. హౌస్‌లో ఉండే వారికోసం బయట సెలబ్రిటీలు సైతం సపోర్ట్ చేస్తుంటారు. అలాగే టాలీవుడ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ కూడా తన సపోర్ట్ ఎవరికో చెప్పుకొచ్చింది. హౌస్‌లో అతని ఆట చూసి ఓ మై గాడ్ అనుకున్నానని. ఎంతో బాగా ఆడుతున్నాడంటూ చెప్పుకొచ్చింది. అతనికి సపోర్ట్ చేయాల్సిన సమయం ఇదని. అందరూ అతని ఓట్ వేయాలంటూ సూచించింది. సింగర్ శ్రీరామ్‌కు తను సపోర్ట్ చేస్తున్నట్లు చెప్పింది పాయల్ రాజ్‌పుత్. శ్రీరామ్ గెలిచి విన్నర్‌గా తిరిగిరావాలంటూ ఆకాంక్షించింది పాయల్ రాజ్‌పుత్.