‘బిగ్ బాస్ 5 తెలుగు’ పంచుతున్న వినోదం అంతా ఇంతా కాదు అనే చెప్పాలి. హౌస్‌లో సభ్యుల వివాదాలు, వినోదాలు, డాన్సులు, గిల్లిగజ్జాలతో సదరు ప్రేక్షకుడిని బాగానే ఎంటర్‌టైన్ చేస్తున్నారు. తాజా ఎపిసోడ్‌లో హౌస్‌లోకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చాడు. రామ్ చరణ్ గెస్ట్ అప్పియరెన్స్‌తో ఇంట్లోని సభ్యుల్లో ఉత్సాహం రెట్టింపయ్యింది. ఇంట్లోని సభ్యులకు మరో సర్‌ప్రైజ్‌గా మాస్ట్రో మూవీ టీమ్ కూడా ఎంట్రీ ఇచ్చింది. నితిన్, తమన్నా, నభా నటేష్‌లను చూసి అందరూ ఉబ్బి తబ్బిబ్బైపోయారు.
అందరూ లేచి నుంచోగానే కింగ్ నాగార్జున గుర్తుపెట్టుకుంటా నేను వచ్చినప్పుడు ఎప్పుడూ లేవలేదుగా అనగానే అందరూ అవాక్కయ్యారు. ఇంట్లోని సభ్యులను రామ్ చరణ్‌కు పరిచయం చేస్తుంటే వారి గురించి ముందే తెలిసినట్లు చెప్పేస్తున్నాడు.
శ్వేతకైతే కచ్చితంగా తన సినిమాలో అవకాశం ఇస్తానంటూ హామీ కూడా ఇచ్చాడు. స్టేజ్‌పై నితన్, తమన్నా, నభా నటేష్ సందడి చేశారు. రామ్ చరణ్‌తో కలిసి మాస్ట్రో బృందం స్టెప్పులేశారు. హౌస్‌లో గాడి తప్పారు కదా.. సెట్ చేద్దాం అన్న నాగార్జున డౌలాగ్‌తో శనివారం, ఆదివారం ఎపిసోడ్లు కచ్చితంగా ఆసక్తికరంగా సాగనున్నట్లు తెలుస్తోంది. ఈ వారం జరిగిన రచ్చపై నాగ్ స్పందిస్తే చూడాలని ప్రేక్షకులు గట్టిగానే కోరుకుంటున్నారు.