‘బిగ్ బాస్ 5 తెలుగు’ సీజన్ ముగిసింది. అందరి అంచనాలను నిజం చేస్తూ.. సన్నీ టైటిల్ విన్నర్ గా అవతరించాడు. మరి.. బిగ్ బాస్ టైటిల్ గెలిచిన మచ్చా ఖాళీగా ఎలా ఉంటాడు? ఫ్యాన్స్ మీట్, ఇంటరాక్షన్స్, ఇంటర్వ్యూస్ అంటూ తెగ బిజీగా గడిపేస్తున్నాడు సన్నీ. ఇందులో భాగంగానే బిగ్ బాస్ విన్నర్ VJ సన్నీ తాజాగా సుమన్ టీవీకి ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు.
హౌస్ లో తనకి ఎదురైన పరిస్థితులు, పడ్డ కష్టాల గురించి సన్నీ ఈ ఇంటర్వ్యూలో ఓపెన్ గా మాట్లాడారు. ఇదే సమయంలో అభిమానులు అడిగిన ప్రశ్నలకి కూడా ఓపిగ్గా సమాధానం ఇచ్చారు. అయితే.., ఇంటర్వ్యూ మధ్యలో ఉండగానే మానస్ సడెన్ ఎంట్రీ ఇవ్వడంతో సన్నీ షాక్ అయిపోయాడు. ఇక మానస్ వచ్చీ రావడంతో సన్నీపై సెటైర్స్ వేయడం, సిరి మ్యాటర్ ని హైలెట్ చేయడంతో సన్నీ సిగ్గుపడిపోయాడు. ఏదేమైనా.. తన ప్రాణ స్నేహితుడు ఇలా లైవ్ లో తనకి సర్ ప్రైజ్ ఇవ్వడం బాగుందని సన్నీ కామెంట్స్ చేయడం విశేషం. ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండ్ అవుతున్న ఈ ఫుల్ ఇంటర్వ్యూ లింక్ ని కింద పొందపరుస్తున్నాము. ఈ పూర్తి ఇంటర్వ్యూ చూసి.. సన్నీ, మానస్ ట్రూ ఫ్రెండ్ షిప్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.