‘బిగ్ బాస్ 5 తెలుగు’ హౌస్‌లో ప్రస్తుతం అంతా వింతగా నడుస్తోంది. ఫ్రెండ్స్ అనుకున్న వాళ్లు కొట్టుకుంటున్నారు. ప్రత్యర్థులు అనుకున్న వాళ్లు మిత్రులు అయ్యేలా ఉన్నారు. ‘నీ ఇల్లు బంగారం గాను’ కెప్టెన్సీ పోటీదారుల టాస్కుతో బిగ్ బాస్ హౌస్ లో పెద్ద రచ్చే పెట్టాడు. ఈ ఒక్క టాస్కు వల్ల గొడవలు కావట్లేదు కానీ.. ఫ్రెండ్స్ అందరూ గిల్లిగజ్జాలు ఆడుకుంటున్నారు. ఈ సీజన్‌లో కొత్తగా పరిచయం చేసిన పవర్ హౌస్ కాన్సెప్ట్ ను బిగ్ బాస్ ఇంకా వాడుతూనే ఉన్నాడు. ఆ పవర్ హౌస్ వల్ల కూడా హౌస్ లో ట్విస్టులు ఇస్తున్నాడు బిగ్ బాస్. తాజాగా గురువారం అనగానే ఒక కొత్త కెప్టెన్ కావాలి కద.. అదెవరో చూద్దాం.
కొత్త కెప్టెన్ గా మానస్..
నీ ఇల్లు బంగారం గాను టాస్కుతో బిగ్ బాస్ రౌండ్ కొక టాస్కు పెట్టి కెప్టెన్సీ పోటీదారులను ఎంచుకున్నారు. అలా గెలిచిన వారికి మరో టాస్కు పెట్టి కెప్టెన్ ను చేస్తాడు. ఆ టాస్కులో మానస్ నాగులపల్లి గెలిచి కొత్త కెప్టెన్ అయ్యాడు. మానస్ ఎప్పటి నుంచో కెప్టెన్ కావాలని ఎదురుచూస్తున్నాడు. ఆ కలను చివరికి నెరవేర్చుకున్నాడు. మానస్ హౌస్‌లో చాలా స్ట్రాంగ్ కంటెండర్. ఇప్పుడు కెప్టెన్‌గా తనకున్న ఇమేజ్‌ను పెంచుకుంటాడో.. ఉన్న ఇమేజ్‌ను పాడు చేసుకుంటాడో అనే ఆసక్తి నెలకొంది. ఎందుకంటే హౌస్‌లో ఎవరు ఏ తప్పు చేసినా కెప్టెన్ మాత్రమే జవాబుదారీ అవుతాడు. అలా మిత్రులు, ప్రత్యర్థులు అంటూ తేడాలు లేకుండా అందరినీ సమానంగా చూడటం. తప్పుచేసింది మిత్రులైనా పనిష్మెంట్ ఇవ్వడం చేయగలగాలి. మానస్ అంత కఠినంగా వ్యవహరించగలడా అన్నదే ప్రశ్న. మానస్ కొత్త కెప్టెన్ గా అవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.