‘బిగ్ బాస్ 5 తెలుగు’ హౌస్ లో సినీ తారలు సందడి చేస్తున్నారు. సన్నీ బాలయ్యను కళ్లకు కట్టినట్లు చూపించాడు. అంతలోనే మానస్ కూడా పవన్ కల్యాణ్ అభిమానిగా పవర్ స్టార్ గెటప్ లో బిగ్ బాస్ హౌస్ లో హై ఓల్టేజ్ ను నింపేశాడు. పోలీస్ డ్రెస్ లో రెడ్ టవల్ కట్టుకుని మానస్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఒక అభిమానికి తాను మెచ్చే హీరోని ఇమిటేట్ చేసే అవకాశం వస్తే ఇంకేముటుంది. మానస్ ఇచ్చి పడేశాడు. దేఖొ దేఖొ గబ్బర్ సింగ్ సాంగ్ కు అదిరిపోయే డాన్స్ వేశాడు. మరి ఆ హై ఓల్టేజ్ పర్ఫార్మెన్స్ ను మీరూ చూసేయండి.