‘బిగ్ బాస్ 5 తెలుగు’ ఆఖరి వారానికి చేరుకుంది. 14వ వారం కాజల్ ఎలిమినేట్ అయ్యింది. టాప్-5లో ఉన్న వారు విన్నర్ ఎవరు అవుతారో అని ప్రేక్షకులు ఇప్పటి నుంచి అంచనాలు మొదలు పెట్టారు. గొడవలన్నీ నా వల్లే అయ్యాయి అన్న కాజల్ కామెంట్ బాగా వైరల్ అవుతోంది. అయితే ప్రస్తుతం కాజల్ రెమ్యూనరేషన్ విషయం హాట్ టాపిక్ అయ్యింది. విన్నర్ కావాలనుకున్న కాజల్ ప్రైజ్ మనీ అంత కాకపోయనా.. మంచి అమౌంట్ నే అందుకుంది బిగ్ బాస్ నుంచి.
వారానికి దాదాపు రూ.2 లక్షలుగా కాజల్ రెమ్యూనరేషన్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. కాజల్ ఉన్న 14 వారాలకు గాను.. దాదాపు రూ.30 లక్షలు వరకు అందినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రూ.30 లక్షలు అంటే చాలా మంచి రెమ్యూనరేషన్ అనే చెప్పాలి. ప్రస్తుతం కాజల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కానీ, 14 వారాలకు రూ.30 లక్షలు సంపాదించే అంత బిజీ అయితే కాదు కదా? అందుకే బిగ్ బాస్ కు వెళ్లడం కాజల్ కల నెరవేరడమే కాదు.. ఆమెకున్న అప్పు కూడా తీరిపోతుందని భావిస్తున్నారు.
కాజల్ చెప్పిన ప్రకారం వారికున్న రూ.30 లక్షల అప్పు తీర్చుకో గలిగితే.. లైఫ్ ను ఫ్రెష్ స్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది. బిగ్ బాస్ షోతో కాజల్ లైఫ్ సెట్ అయిపోయినట్లేనా? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.