‘బిగ్ బాస్ 5 తెలుగు’ ప్రతి ఎపిసోడ్ చాలా ఇంట్రస్టింగ్‌గా ప్లాన్ చేస్తున్నారు. కెప్టెన్సీ టాస్కులతో బెదరగొట్టిన ఇంట్లోని సభ్యులతో కాస్త రొమాంటిక్ టచ్ ఇచ్చారు. వెంటనే మళ్లీ హీట్ మొదలైపోయింది. వరస్ట్ పర్ఫార్మర్ ఎవరో నిర్ణయించాలన్న ఒకే ఒక్క ప్రశ్నతో సభ్యుల మధ్యలో వాదనలు మొదలయ్యాయి. నువ్వు బాగా ఆడలేదంటే నువ్వు అంటూ నిందలకు దిగారు. బిగ్ బాస్‌తో మాములుగా ఉండదు అని మరోసారి ప్రూవ్ అయ్యింది. ఏకాభిప్రాయంతో వరస్ట్ పర్ఫార్మర్‌ని ఎంచుకోండి అనగానే అందరి ముఖాలు ఎర్రబడ్డాయి. వీజే సన్నీ అతని టీమ్ మేట్ నటరాజ్ మాస్టర్‌ని చూస్ చేసుకున్నాడు. ప్రియాంక సింగ్ వరస్ట్ పర్ఫార్మర్‌గా ఎంచుకుంటే నేను తీసుకోనని చెప్పేసింది.
ఈ టాస్కుకు సంబంధించి ‘వీజే సన్నీ’ వరస్ట్ పర్ఫార్మర్‌గా ఎంపిక కాబోతున్నాడు. టాస్కు సమయంలో సన్నీకి హౌస్‌మేట్స్‌లో చాలా మందితో వివాదం జరిగింది. ముఖ్యంగా ప్రియ, సింగర్ శ్రీరామ్‌తో సన్నీ వాగ్వాదానికి దిగాడు. శ్రీరామ్‌తో అయితే బాహాబాహీకి సై అన్నాడు. ముందు ఈ అంశంపై ఏకాభిప్రాయం లేకున్నా కూడా తర్వాత ఇంటి సభ్యులందరూ కలిసి వీజే సన్నీని వర్సట్ పర్ఫార్మర్‌గా ఎంపిక చేశారు. సింగర్ శ్రీరామ్ కూడా తన ప్రవర్తనపై ఎక్కడా కూడా చింతించడానికి ఏమీ లేదని చెప్పుకొచ్చాడు.
లగ్జీరీ బడ్జెట్ టాస్కు కూడా ఈసారి గల్లంతు అయ్యేలాగే ఉంది. బాల్ పట్టు లగ్జరీ బడ్జెట్ కొట్టు అంటూ పెట్టిన టాస్కులో ఇంట్లోని సభ్యులు అంతంత మాత్రంగానే ప్రదర్శన చేసినట్లుగా తెలుస్తోంది. ప్రియ, ఆర్జే కాజల్ మధ్య మాటల యుద్ధం బాగా ముదిరిపోయింది. అలా అయితే అదే నీ సంస్కారం అనుకుంటా అని ప్రియ ఆర్జే కాజల్‌ను అనేసింది. అలా అయితే మీ సంస్కారం అదే అని నేను అనుకుంటా అని ఆర్జే కాజల్ సమాధానమిచ్చింది. అబద్ధాన్ని చాలా పకడ్బందీగా చెప్తున్నావంటూ కాజల్‌ను విమర్శించింది ప్రియ. మరోసారి కాజల్ కన్నీటిపర్యంతం అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
‘బిగ్ బాస్ 5 తెలుగు’ లేటెస్ట్ అప్‌డేట్స్, గాసిప్స్, ఎలిమినేషన్స్ వంటి ఆసక్తికర కథనాల కోసం సుమన్ టీవీ వెబ్‌సైట్‌ని చూస్తుండండి.