రోజులు గడిచే కొద్దీ బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ మధ్య గొడవలు పెరుగుతున్నాయి. ఇక ఇప్పటికే ఇంటి నుండి సరయు, ఉమాదేవి ఎలిమినేట్ అయిపోయారు. ఇక మూడో వారం ఎలిమినేషన్స్ ప్రాసెస్ కూడా జోరుగా జరుగుతోంది. ఇక మూడో వారంలో కూడా లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వడం ఖాయమన్న టాక్ వినిపిస్తోంది. దీంతో.. బిగ్ బాస్ హౌస్ లో లేడీస్ సంఖ్య రోజురోజుకి తగ్గిపోతూ వస్తోంది. ఇక హౌస్ లో మిగిలిన లహరి, కాజల్, హమీదాతో 100 రోజుల పాటు షోని లాగడం కష్టం అనుకున్న బిగ్ బాస్ నిర్వాహకులు అప్పుడే వైల్డ్ కార్డ్ ఎంట్రీలకి తెర లేపారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
బిగ్ బాస్ నిర్వాహకులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వారికి లీకుల బెడద తప్పడం లేదు. ఇందులో భాగంగానే నెక్స్ట్ వైల్డ్ కార్డు ఎంట్రీకి సంబంధించిన ఓ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పిక్ లో ఓ బ్యూటీ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తున్నా, ఆమె మొహం మాత్రం కనిపించడం లేదు. కేవలం ఇందులో ఆమె తొడ అందాలు మాత్రమే రివీల్ అయ్యింది. మరి.. హౌస్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వకముందే తన హాట్ అందాలతో దుమ్ము రేపుతున్న ఆ సుందరాంగి ఎవరు..? ఇదే విషయంలో సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. ఆ థై.. సొగసులు చూస్తే.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతుంది వర్షిణి అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరి.. వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వబోతున్న ఆ తొడల సుందరి ఎవరు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.