బుల్లితెర ప్రేక్షకులను 105 రోజులు అలరించిన ‘బిగ్ బాస్ 5 తెలుగు’ సీజన్ ముగిసింది. టైటిల్ విన్నర్ గా వీజే సన్నీ గెలుపొందాడు. రన్నరప్ గా షణ్ముఖ్ జశ్వంత్ నిలిచాడు. విన్నర్ కు ఈ సారి రెమ్యూనరేషన్, ప్రైజ్ మనీ అన్నీ కలిపి కోటి కంటే ఎక్కువగానే అప్పజెప్పారు. ఈసారి ప్రైజ్ మనీకి అదనంగా రూ.25 లక్షల విలువజేసే ప్లాట్ కూడా అందించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా బిగ్ బాస్ గురించే హాట్ టాపిక్ అయ్యింది. అయితే గ్రాండ్ ఫినాలే హీట్ లోనే నెక్ట్స్ సీజన్ ఎప్పుడో హోస్ట్ నాగార్జున లీక్ ఇచ్చేశాడు. ఈ సీజన్ ముగిసిందో లేదో.. అప్పుడే ‘బిగ్ బాస్ 6 తెలుగు’ సీజన్ కూడా పట్టాలెక్కుతోందని తెలుస్తోంది.
ఈ విషయంపై ఎవరు చెప్పిన నమ్మకపోయేవారు.. కానీ, ఏకంగా నాగార్జునానే డైరెక్ట్ గా చెప్పడంతో నమ్మేస్తున్నారు. ఏంటంటే బిగ్ బాస్ నెక్ట్స్ సీజన్ కు పెద్ద గ్యాప్ లేదంటే త్వరలోనే స్టార్ట్ కాబోతందని తెలుస్తోంది. మామూలుగా అయితే ఒక సీజన్ ముగిశాక దాదాపు ఆరు నెలలు అయిన గ్యాప్ తీసుకుని తర్వాతి సీజన్ ను ప్రారంభిస్తారు. ఈసారి మాత్రం అంత గ్యాప్ తీసుకునేలా కనిపించడం లేదంటున్నారు. అతి త్వరలోనే మొదలు కాబోతోందంట.
స్టేజ్ పై విన్నర్ ను అనౌన్స్ చేసిన తర్వాత హోస్ట్ నాగార్జున ఈ విషయంపై కూడా క్లారిటీ ఇచ్చాడు. తర్వాతి సీజన్ నెక్ట్స్ ఇయర్ మొదలైన రెండు నెలల్లోనే ప్రారంభం అవుతుందని చెప్పాడు. అంటే కింగ్ నాగ్ చెప్పిన దాని ప్రకారం బిగ్ బాస్ 6 తెలుగు సీజన్ 2022 మార్చి నెలకల్లా మొదలవుతుంది. 6 నెలల గ్యాప్ 3 నెలలకే కుదించారు. ఇలా అయితే బుల్లితెర ప్రేక్షకులకు ఎంటర్ టైన్మెంట్ కు కొదవ ఉండదనే టాక్ వినిపిస్తోంది. బిగ్ బాస్ 6 తెలుగు కోసం ఎదురు చూస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.