‘బిగ్ బాస్ 5 తెలుగు’ హైఎస్ట్ టీఆర్పీ, జీఆర్పీలతో బాగానే నడుస్తోంది. బుల్లితెర ప్రేక్షకులను కట్టిపడేస్తోందనే చెప్పాలి. హౌస్‌లో కెప్టెన్సీ టాస్క్‌తో మొదలైన డ్రామా ఒక ఎండ్‌కు చేరుకుంది. కెప్టెన్సీ పోటీదారులుగా శ్వేత, సింగర్ శ్రీరామ్, యాంకర్ రవి, మోడల్ జెస్సీ ఎంపికయ్యారు. కెప్టెన్సీ కోసం ‘స్విమ్ జర’ టాస్కుని ఇచ్చాడు బిగ్ బాస్. అంటే స్విమ్మింగ్ పూల్‌లో ఆంగ్ల అక్షరాలు ఉంచారు. వాటిని తెచ్చి కెప్టెన్ అనే పదాన్ని పూరించాలి. అందుకు సభ్యులు బాగానే కష్టపడ్డారు. అందులో సింగర్ శ్రీరామచంద్ర ఉత్తమ ప్రదర్శనతో హౌస్‌లో మూడో కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ విషయంపై హౌస్‌లో ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఇదిలా ఉండగా షణ్ముఖ్, సిరిల మధ్య కాస్త చెడినట్లు కనిపిస్తోంది.
హౌస్‌లో వాళ్లు అనే మాటలో.. లేదా సిరితో నిజంగానే దూరంగా ఉండాలని షణ్ముఖ్ భావిస్తున్నాడో గానీ, ఆమెతో పలకడం మానేశాడు. తాజా విడుదల చేసిన ప్రోమోలో సిరి హన్మంతు.. షణ్ముఖ్‌ని మాట్లాడాలని బతిమిలాడుకుంటూ కనిపిస్తుంది. ‘నాకు మంచి మాటలు రావు మళ్లీ ఏదైనా అంటాను’ అని షణ్ముఖ్ అన్నాడు. ‘నువ్వు తిట్టు పర్లేదు అలాగైనా నాతో మాట్లాడావు అనుకుంటా’ అంటూ సిరి సమాధానమిస్తుంది. షణ్ముఖ్‌నే పట్టుకుని మాట్లాడాలంటూ తిరుగుతుంటుంది. అందుకు షణ్ముఖ్ బాగా చిరాకుగా రెండు వారాలు గడిస్తే అదే అలవాటు అయిపోతుందిలే అంటాడు. నాకు ఇంట్రస్ట్ లేదంటూ సిరిని దూరంపెట్టేందుకు షణ్ణు బాగా ప్రయత్నిస్తాడు. నేనేమన్నా గార్ల్ ఫ్రెండ్‌నా ఇంట్రస్ట్ లేదనడానికి అని సిరి ప్రశ్నిస్తుంది. అందుకు షణ్ముఖ్ చాలా కఠినంగా ‘నాకు ఫ్రెండ్‌షిప్‌కు కూడా ఇంట్రస్ట్ లేదు’ అనగానే సిరి హన్మంత్ వెళ్లిపోతుంది. హౌస్‌లో ఒంటరిగా కూర్చోని ఏడుస్తుటుంది.
అసలు ఎందుకు వీళ్లిద్దరూ ఇలా అయిపోయారు.. అని అభిమానులు ఆలోచనలో పడ్డారు. అప్పుడు 7ఆర్ట్స్ సరయు చేసిన ఆరోపణలు కానివ్వడం.. ఉమ చేసిన విమర్శలు.. హౌస్‌లో అప్పుడప్పుడు వీళ్లద్దరూ ఒక్కటే అన్న మాటలు.. కారణం ఏదైనా షణ్ముఖ్ మాత్రం హౌస్‌లో సిరికి దూరంగా ఉండాలని ఫిక్స్ అయిపోయినట్లు కనిపిస్తోంది. చూద్దాం ‘సిరి-షణ్ముఖ్’ ఎపిసోడ్ ఎప్పటివరకు సాగుతుందో.
‘బిగ్ బాస్ 5 తెలుగు’ లేటెస్ట్ అప్‌డేట్స్, గాసిప్స్, ఎలిమినేషన్స్ వంటి ఆసక్తికర కథనాల కోసం సుమన్ టీవీ వెబ్‌సైట్‌ని ఫాలో అవ్వండి.