‘బిగ్ బాస్ 5 తెలుగు’ సీజన్ ఆఖరి మజిలీకి చేరుకుంది. హౌస్ లో గేమ్స్, టాస్కులతో ఫుల్ హంగామా నడుస్తోంది. హౌస్ మేట్స్ తగ్గే కొద్దీ ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నారు. ట్రూ ఎమోషన్స్ బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా హౌస్ మేట్స్ అందరూ ఒకరి నొకరు అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నట్లు కనిపిస్తోంది. అది ఒక విధంగా మంచి.. మరో విధంగా కొత్త ఒపీనియన్లు కూడా పుట్టుకొస్తున్నాయి. అయితే సిరి- షణ్ముఖ్ విషయంలో మాత్రం అది చాలా రచ్చే చేస్తున్నట్లు తెలుస్తోంది. సిరి- సన్నీ మధ్య ఏదో ఉందనింపిచేలా చేసేతందుకు కాజల్- మానస్ చాలా సందర్భాల్లో ప్రయత్నించడం చూశాం. అదే ఇప్పుడు షణ్ముఖ్- సిరి మధ్య గొడవలకు కారణం అయ్యినట్లు తెలుస్తోంది.
‘నిన్ను బ్యాడ్ చేయాలని చూస్తే ఆపాను. ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంటే కంట్రోల్ చేశాను. మీ మమ్మీ వచ్చి హగ్ అంటూ మాట్లాడినా తీసుకున్నా. దీని వల్ల నేను నెగెటివ్ అవ్వను. నీకు మాత్రం నచ్చింది అవుతోంది. ఇక నుంచి ఇంట్లోని సభ్యులు ఎలాగో.. నువ్వు కూడా అలాగే. వెళ్లు ఇక్కడి నుంచి నా నెత్తిన ఎక్కి తొక్కకు’ అంటూ శివాలెత్తి పోయాడు. అందుకు ఇంట్లో నడుస్తున టాస్కు కూడా కారణం అయ్యే అవకాశం ఉంది. మరోవైపు కాజల్- మానస్ చేస్తున్న కామెంట్లు కూడా వీళ్ల మధ్య గొడవకు కారణం అయ్యే అవకాశం లేకపోలేదు. సిరి- షణ్ముఖ్ మధ్య గొడవలకు కారణం ఎవరు? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.