షణ్ముఖ్ తో దీప్తి సునైనా బ్రేకప్ కానుందా? ఇప్పుడు ఇదే వార్త నెట్టింట్లో కాస్త వైరల్ గా మారుతోంది. పికల్లోతు ప్రేమల్లో మునిగితేలుతున్న వీళ్లు బ్రేకప్ చెప్పుకోవటం ఏంటన్న ప్రశ్న రావచ్చు ..కానీ దీనికి సంబంధించి ఆధారాలు కూడా ఉన్నాయని నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. బిగ్ బాస్ 5 తెలుగులో కంటెస్టెంట్ గా హౌస్ లో షన్ను దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అయితే షన్ను-సిరి హౌస్ లో మరీ క్లోజ్ మూవ్ అవుతూ ఫ్రెండ్లీగా ఉన్నారు.
అయితే ఇటీవల సిరి షన్నుకి ముద్దు పెట్టిన విషయం తెలిసిందే. సిరి షన్నుకి ముద్దు పెట్టడంపై సిరి లవర్ స్పందించి ఇప్పుడు నేను ఏడవాలా.. షార్ట్ ఫిలిమ్ లో, సినిమాల్లో చేస్తే మీకు ఓకే కదా అంటూ సిరికి మద్దతిచ్చాడు. కానీ దీప్తి ఇంత వరకు కూడా ఈ అంశంపై ఎలాంటి రిప్లయ్ ఇవ్వకుండా మౌనంగా ఉంది. ఈ మౌనమే వీరి బ్రేకప్ కు కారణమే అంటూ నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. ఇక మరో విషయం ఏంటంటే..? ఇటీవల కాలంలో దీప్తి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి షన్ను ని రిమూవ్ చేసిందనే వార్తలు కూడా లేకపోలేదు.
మరో పక్కా అలాంటిది ఏం లేదని, షన్ను బిగ్ బాస్ విన్నర్ కావటానికి దీప్తి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుందని, హౌస్ లో పరిస్థితుల కారణంగానే వీళ్లు అలా ఉంటున్నారంటూ మరి కొందరు మద్దతిస్తున్నారు. నిజానికి దీప్తీ సునయన షన్ను బిగ్ బాస్ విన్నర్ కావటానికి అనేక రకాలైన ప్రమోషన్స్ చేస్తూ షన్నుకి ఓటింగ్ పెరిగేలా చేస్తుంది. ఇక వీరిద్దరి లవ్ బ్రేకప్ గురించి దీప్తీ అధికారికంగా ఎలాంటి విషయాన్ని కూడా వెల్లడించలేదు.