‘బిగ్ బాస్ 5 తెలుగు’ మోస్ట్ సక్సెస్‌ఫుల్ రన్నింగ్ బుల్లితెర రియాలిటీ షో. రోజులు గడుస్తున్న కొద్దీ మంచి ఉత్కంఠగా సాగుతోంది. కెప్టన్సీ టాస్కులో ఒక గొడవ తీవ్ర దుమారమే రేపింది. సన్నీ- సిరిల మధ్య మొదలైన వివాదం కాస్తా.. షణ్ముఖ్- సన్నీల వివాదంలా మారిపోయింది. ఎప్పటిలాగానే సన్నీ ఫుల్ ఓవర్‌గా అరిచేసి నానా రచ్చ చేశాడు. రచ్చే కాదు రా.. గీ.. అంటూ నోరు పారేసుకున్నాడు కూడా. కోపం చాలా తగ్గించుకున్నా అని చెప్పే సన్నీ ఇలా ప్రవర్తించడం అందరినీ కాస్త అన్ కంఫర్ట్ జోన్‌లోకి తీసుకెళ్లింది. కావాలంటే కొట్టు అంటూ షణ్ముఖ్ మీదకు కూడా వెళ్లాడు. ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా షణ్ముఖ్ ఫ్యాన్స్ ఫుల్ ఫైర్ అవుతున్నారు. ఒక్క అభిమానులే కాదు.. దీప్తీ సునైనా కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇన్ స్టా గ్రామ్‌లో పెట్టిన పోస్టులో సన్నీకి కొన్ని చురకలు కూడా అంటించింది.
ఎప్పటి లాగానే ఒక టాస్కు పెట్టి వారిలో కొందరిని కెప్టెన్సీ పోటీదారులుగా ఎంపిక చేస్తారు. అలా ఎంపికైన వారికి మళ్లీ ఒక టాస్కు పెట్టి కెప్టెన్‌ను ఎంచుకుంటారు. అలా కెప్టెన్సీ పోటీదారులుగా ఎంపికైన సిరి, కాజల్, రవి, సన్నీలకు ఒక టాస్కు పెట్టారు. అందులో సిరి.. సన్నీని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. అతడ్ని గట్టిగా పట్టుకుని నిలువరించే ప్రయత్నం చేస్తుంది. అలా చేసినందుకు సన్నీ బాగా ఫైర్ అయ్యాడు. పోటీపడే వాడిని అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించాడు. ‘నేను కొడితే అప్పడం అవుతావు’ అని సన్నీ అన్న మాటతో అసలు గొడవ మొదలైంది. అందుకు షణ్ముఖ్ రెస్పాండ్ అవ్వగానే సన్నీ ఇంకా ఫైర్ అయ్యాడు. అక్కడే నాలుగు మాటలు జారాడు కూడా.
అలా నోరుపారేసుకున్న సన్నీకి దీప్తీ సునైనా సోషల్ మీడియా వేదికగా కొన్ని ప్రశ్నలు, నాలుగు చురకలు విసిరింది. ‘అప్పడం అయిపోతావు అనవసరంగానా? నువ్వు ఒక్కడివే ది బెస్ట్ అనుకో తప్పులేదు.. కానీ, మిగతా అందరినీ ఎందుకు అలా చూస్తున్నారు? చేతగాని ఆటలు ఆడుతున్నాడు ఏంటి?.. ఫిజికల్ అయ్యి, గట్టి గట్టిగా అరిస్తే గేమ్ ఆడినట్టా? ఫిజికల్ కాకుండా మైండ్‌తో గేమ్ ఆడటం చాలా కష్టం షణ్ము ఈజ్ గివింగ్ హిజ్ బెస్ట్.
‘షణ్ముఖ్ నాకు క్లోజ్ అన్న విషయం పక్కనబెడితే.. లవింగ్ హిమ్ మోర్ ఆఫ్టర్ వాచింగ్ బిగ్ బాస్. అంత మెచ్యూర్ గా బిహేవ్ చేస్తున్నాడు. ఆడవాళ్లను అడ్డుపెట్టుకుని గేమ్ ఆడుతున్నాడా? ఆడవాళ్లకు సపోర్ట్ చేస్తే అడ్డుపెట్టుకుని గేమ్ ఆడుతున్నాడు అనడం రాంగ్ స్టేట్‌మెంట్. నీకు కాజల్, మానస్ చేస్తే అలానే ఫీల్ అవుతున్నామా మేము? ఏం ఆడుతున్నావు నువ్వు గేమ్? ఆ నువ్వు ఎలా ఉన్నావో.. మిగతా వాళ్లు అలానే ఉండాలా ఏంది? నీలా ఇంకొకరు ఎందుకు ఉంటారు. ఇంకొకరిలా మీరు ఎలా ఉండగలరు?’.
‘యూట్యూబ్ వరకే గుర్తుపెట్టుకోనా? ఈ స్టేజ్ వరకూ వచ్చాడు ఒక్కడే అని తెలిసి హ్యాపీ ఫర్ యూ అనుకోవాలి గానీ.. యూట్యూబ్ వరకే ఏంది? తప్పు సన్నీ గారు. రియల్లీ లవ్డ్ యువర్ ప్రెసెన్స్ హౌస్‌లో బట్ ఈరోజు చూడలేకపోయా. రా అంటేనే తట్టుకోలేరు. మరి మీరు అన్ని మాటలు అంటే ఎలా?’ అంటూ దీప్తీ సునైనా గట్టిగానే ఫైర్ అయ్యింది. సన్నీ యాక్షన్ కు.. దీప్తీ సునైనా రియాక్షన్ పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
#BiggBossTelugu5 Winner 🏆🔥#Shannu #shanmukhjaswanth #BheemlaNayak #shannu
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥@shannu__7 💙 pic.twitter.com/mDqFdQVWlC— 𝑼𝒏 𝒍𝒖𝒄𝒌𝒚 𝑩𝒐𝒚 (𝑱𝒂𝒈𝒂𝒅𝒊𝒔𝒉) 💞 (@NamiesJagadish) November 12, 2021
Very heated argument 🔥🔥🔥 #vjsunny #shanmukhjaswanth #siri https://t.co/EF5B2M3Uqu
— Maanas BIGGBOSS (@BiggbossMaanas) November 12, 2021