‘బిగ్ బాస్ 5 తెలుగు’ రాను రాను హౌస్‌లో వాతావరణం చాలా హీటెక్కుతోంది. మాటలు, ఆరోపణలు, సవాళ్లు, కన్నీళ్లు ఇవన్నీ దాటి తాజాగా టాస్కు రూపంలో కుమ్ములాట కూడా జరుగుతోంది. సదరు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడం కోసం హౌస్‌లో కంటెస్టెంట్లు తమ 100 శాతం ఇస్తున్నారు. టాస్కులు పెరుగుతున్న కొద్దీ హౌస్‌లో గొడవలు కూడా ఎక్కవవుతున్నాయి. తాజాగా కెప్టెన్సీ టాస్క్‌లో ఆ గొడవ కాస్త గట్టిగానే అయినట్లు తెలుస్తోంది.
ఈ వారం కెప్టెన్సీ టాస్కులో రెండు బృందాలుగా విడపోయి వారికి కేటాయించిన స్థలంలో అవతలి వారికి చెందిన ప్యాకెట్లు వంటి వస్తువులను ఉంచాలి. వాటిని సేకరించి దాచిపెట్టాలి. ఈ టాస్క్‌లో ఎవరైతే తమ 100 శాతం ఇస్తారో వారే కెప్టెన్ అవుతారు. అందరికీ తెలిసిన విషయమే కెప్టెన్ అయితే వారికి ఇమ్యూనిటీ లభిస్తుంది. అందుకోసం బాగానే కష్టపడుతున్నారు. ఈసారి రవి కూడా బాగానే గుస్సా అయ్యాడు. ఆర్జే కాజల్ టాస్క్‌లో ఉమెన్ కార్జును తీసేందుకు ప్రయత్నించగా కొందరు దానిని తప్పుబడతారు. ఈ టాస్కులో హౌస్ మేటస్ కి బాగానే గాయాలయ్యాయి.
వీజే సన్నీ, సిరి హన్మంతుకు వివాదం జరిగింది. సన్నీ తనను లాగినట్లు సిరి ఆరోపిస్తుంది. దానిని నిరూపించాల్సిందిగా సన్నీ కోరుతాడు. అందుకు నిరాకరించి సిరి ఆటను మధ్యలో ఆపేస్తుంది. ఈ టాస్కు వల్ల ప్రేక్షకులకు గట్టి ఎంటర్‌టైన్మెంట్ లభిస్తుంది. కెప్టెన్ ఎవరు అయినా.. పక్కా ఫీస్ట్ అనమాట. షణ్ముఖ్ ఈ టాస్క్‌లో బాగానే పార్టిసిపేట్ చేశాడు. ఆట మధ్యలో సన్నీ, షణ్ముఖ్‌కి మధ్య తోపులాట జరిగింది. షణ్ముఖ్, సిరి, సన్నీ వీరి ముగ్గురి మధ్య ఏదో గట్టిగానే జరగబోతోందని అభిమానులు మాట్లాడేసుకుంటున్నారు.
‘బిగ్ బాస్ 5 తెలుగు‘కు సంబంధించిన అన్ని అప్‌డేట్స్, ఎలిమినేషన్స్, గాసిప్స్ వంటి ఆసక్తికర కథనాల కోసం సుమన్ టీవీ వెబ్‌సైట్‌ను చూస్తూ ఉండండి.