‘బిగ్ బాస్ 5 తెలుగు’ ఎమోషన్స్, సవాళ్లు, యుద్ధాలతో ప్రస్తుతం బాగా హాట్ హాట్‌గా ఉన్న హౌస్‌లో ఒక్కసారిగా రొమాంటిక్ మూడ్ వచ్చేసింది. షణ్ముఖ్ బర్త్‌డే సెలబ్రేషన్స్ హౌస్‌లో ఓ రేంజ్‌లో ప్లాన్ చేశారు. మరోవైపు షణ్ముఖ్ ప్రేయసి దీప్తీసునైనా వారి మిత్రులు అందరూ కలిసి బిగ్ బాస్ హౌస్ సెట్ బయట సంబరాలు జరిపారు. బాణసంచా కాల్చుతూ షణ్ముఖ్‌కు బర్త్ డే విషెస్ తెలిపారు. అందుకు హౌస్ నుంచి షణ్ముఖ్ సహా మొత్తం ఇంట్లో సభ్యులు అందరూ థ్యాంక్యూ అంటూ వారికి సమాధానమిచ్చారు. ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది.
మరోవైపు బిగ్ బాస్ కూడా షణ్ముఖ్‌కి బర్త్ డే గిఫ్ట్ ప్లాన్ చేశాడు. అతని ప్రేయసి దీప్తీ సునైనాని వీడియో కాల్ ద్వారా షణ్ముఖ్‌కి చూపించారు. దీప్తీ సునైనా విష్ చేస్తూ ‘లవ్ యూ’ అనగానే మనోడు సిగ్గుపడుతూ తల దించుకుని బాగా ఎమోషనల్ అయిపోయాడు. మొత్తం టాస్కులతో హాట్ హాట్‌గా ఉన్న హౌస్ ఒక్కసారిగా చల్లబడినట్లైంది. కెప్టెన్సీ టాస్కులతో రాజుకున్న వివాదాలకు ఇంకా ముంగిపు కార్డు పడలేదు. ఎవరు ఎలా సారీలు చెప్తారో.. ఎలా బుజ్జగించుకుంటారో చూడాలని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.
హౌస్‌లో కాసేపు షణ్ముఖ్‌ని అందరూ ఆటపట్టించారు. దిండుపై ‘S’, ‘D’ అని రాసుకుంటాడు షణ్ముఖ్. ఆ పిల్లోపై హౌస్‌లో ఉన్నన్ని రోజులు షణ్ముఖ్, హమీదా వచ్చేలా ‘S’, ‘H’ రాయాలంటూ హమీదా సూచిస్తుంది. అందుకు యాంకర్ రవి మీరు ఇది చూడాలి. హౌస్‌లో ఏదో జరుగుతోంది అంటూ ఆటపట్టిస్తారు.