వాదనలు, వివాదాలు, కవ్వింపులు, కాంప్రమైజ్ లు మధ్య బిగ్ బాస్-5 సీజన్ 7 వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పటికే హౌస్ నుండి కొంతమంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయిపోయారు. ఇక హౌస్ ఉన్న వారిలో ఎవరు స్ట్రాంగ్, ఎవరు వీక్ అన్న అంచనాలకి ప్రేక్షకులు కూడా వచ్చేస్తున్నారు. నిజానికి హౌస్ లో ప్రతి ఒక్కరు స్ట్రాటజీతో గేమ్ ఆడుతున్నారు. కానీ.., ప్రతిసారి రవి మాత్రమే అందరికీ ఎందుకు టార్గెట్ అవుతున్నాడు? ఇదే అతని అభిమానుల ప్రశ్న.
గతంలో బాత్ రూమ్ హగ్ సమయంలో కూడా అంతా కలసి రవిదే తప్పు అని తేల్చారు. ఆ సమయంలో అతను నిజంగానే నోరు జారాడు కూడా. అందుకు అప్పుడే క్షమాపణలు చెప్పుకున్నాడు. కానీ.., కింగ్ నాగార్జున అక్కడ నుండి రవిని అదే ఉద్దేశ్యంతో చూస్తున్నారా? ఆయనకి రవి గేమ్ స్టైల్ నచ్చడం లేదా? రవిని వీలైనంత త్వరగా బయటకి పంపడానికి బిగ్ బాస్ హౌస్ లో భారీ కుట్ర జరుగుతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా టెడ్డీ డ్యామేజ్ విషయం ఈ అనుమానాలకు బలం చేకూర్చింది.
“హౌస్ ప్రాపర్టీ డ్యామేజ్ చేయకూడదు అని నాకు తెలియదు, రవి చేయమంటేనే చేశా” అని లోబో సమాధానం చెప్పగానే నాగార్జున కోపం పీక్స్ కి వెళ్లిపోయింది. “రవి గడ్డి తినమంటే తినేస్తావా? రూల్స్ తెలుసుకోకుండా హౌస్ లోకి ఎలా వస్తారు” అంటూ నాగ్ ఫైర్ అయ్యారు. ఆ తరువాత రవి వంతు రాగానే నాగ్ ఇంకాస్త హాట్ కామెంట్స్ చేశారు. రవి.. నువ్ స్ట్రాటజీలు చేయ తప్పులేదు. కానీ.. బ్లేమ్ చేయకు అంటూ క్లాస్ పీకడం మొదలుపెట్టారు నాగార్జున. అంతేగాక రవి చేసింది తప్పు అని హౌస్ లో అందరి చేత చెప్పించి, అతనిని ఒంటరిని చేసే ప్రయత్నం చేశారు. నిజానికి హౌస్ ప్రాపర్టీ డ్యామేజ్ చేయడం అంత పాపం అయితే.. గతంలో ఇలాంటి డ్యామేజ్ లు ఎప్పుడూ జరగలేదా?
బోర్డ్‌లపై ఫొటోలు పెట్టి వాటిని కాపాడుకోవాలని పెట్టిన టాస్క్‌లో ఏకంగా బోర్డ్‌లు పగిలిపోయాయి. శ్రీరామ్, జెస్సీ, విశ్వ వీళ్లంతా కూడా అందులో భాగమే. కానీ.., నాగార్జున అప్పుడు వారిని ఎందుకు అంత తీవ్రంగా ప్రశ్నించలేదు? రవిని మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అన్న చర్చ సోషల్ మీడియాలో విపరీతంగా జరుగుతోంది. మరి.. నిజంగానే హౌస్ నుండి రవిని బయటకి పంపించడానికి కుట్ర జరుగుతోందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి