‘బిగ్ బాస్ 5 తెలుగు’ హౌస్ నుంచి హమీదా ఎలిమినేట్ అయ్యాక ఇంట్లో ఒక్క రొమాంటిక్ కపుల్ కూడా లేకుండా పోయింది. వంటగదిలో ముచ్చట్లు, లాన్‌లో నైట్ వాక్లు, స్విమ్మింగ్ పూల్ దగ్గర చిలిపి కబుర్లు కరువయ్యాయి. ప్రేక్షకులు కూడా ఇంట్లోని సభ్యుల గొడవలతో విసిగిపోతున్నారు. వాళ్లకి కొంచం పువ్వులని.. అమ్మాయిలని చూపించాలని బిగ్ బాస్ ప్రయత్నించినా.. అందుకు ఫలితం లేకుండా పోయింది. కాస్తో కూస్తో ట్రాక్ మిగిలి ఉంది అంటే అది మానస్, ప్రియాంక సింగ్‌ల మధ్య మాత్రమే. తాజా పరిణామాలు చూస్తే అది కూడా వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు.
ఇదీ చదవండి: కూతురులాంటి దానివంటూ విద్యార్థినితో గురువు పిచ్చి పని.. దేహశుద్ధి చేసిన తల్లిదండ్రులు.. వీడియో వైరల్
ప్రియాంక సింగ్.. మానస్‌ను అన్నయ్య అని పిలవను అని చెప్పిన దగ్గర్నుంచే వీళ్ల మధ్య ట్రాక్ ఉందేమో అనే భావన ప్రేక్షకుల్లో కలిగింది. ప్రియాంక తర్వాత మానస్ బెడ్‌షీట్స్ సర్దటం.. అతన్ని వెన్నంటే ఉంటూ తన అవసరాలు తీర్చడం. అతని అటెన్ష కోసం తాపత్రయం పడటం చూసి అందరూ ఆనందపడ్డారు. క్యూట్ కపుల్ అయ్యేలా ఉన్నారే అని అనుకున్నారు. తర్వాత మానస్ వైపు నుంచి కూడా కొంత అప్రోచ్ కనిపించింది. రేషన్ మేనేజర్ టాస్కులో సన్నీని కాదని ప్రియాంక సింగ్ గెలిపించినప్పుడే ఏదో ఉందని టాక్ మొదలైంది. తర్వాత మళ్లీ వారి మధ్య దూరం పెరిగింది.
మానస్ అందరికీ అన్నం తినిపిస్తూ ప్రియాంకను పట్టించుకోడు. ఆ విషయంలో ప్రియాంక సింగ్ చాలా బాధ పడింది. ఆ విషయం గమనించిన సన్నీ ప్రియాంకను ఓదార్చేందుకు ప్రయత్నిస్తాడు. ఆ సమయంలో పింకీ ఎంతో ఎమోషనల్‌గా తనకు ఎప్పుడు ఏం కావాలో కళ్లలో చూసి తెలుసుకుంటాను. తను మాత్రం అలా కాదు నన్ను అవోయిడ్ చేస్తున్నాడంటూ బాధ పడుతుంది. సన్నీ అదే విషయాన్ని మానస్‌కు చెప్పగా.. నేను అలా అనుకోలేదు అంటూ వివరణ ఇచ్చేందుకు చూస్తాడు. చివరిగా నాకు మూడుసార్లు బ్రేకప్ అయ్యింది.. అన్నీ తెలిస్తే అలా అవ్వదు కదా అన్న కోణంలో తన బ్రేకప్ స్టోరీ గురించి చెప్పుకొచ్చాడు మానస్. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండే మానస్‌కు బ్రేకప్ స్టోరీలా అంటూ అభిమానులు ఆశ్చర్యపోయారు. మానస్- ప్రియాంక సింగ్ రిలేషన్ కొనసాగుతుందా? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.