ఆదివారం వచ్చిందంటే అందరిలోనూ టెన్షన్ మొదలవుతుంది. హోస్ట్ నాగార్జున వచ్చి ఎవరు ఎలిమినేట్ అంటారా అని ఆసక్తిగా చూస్తుంటారు. ముందుగా హౌస్ లో ఉన్న అందరితో ఆటలాడించి నవ్వులు పూయించిన తర్వాత నాగ్ ఎలిమినేషన్ ప్రక్రియ మొదలు పెడతాడు. ఈ వారం మానస్, కాజల్, పింకీ, సిరిలలో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనే దానిపై మరి కొన్ని గంటల్లో అఫిషియల్‌గా ఓ క్లారిటీ రానుంది. అయితే నెట్టింట మాత్రం ప్రియాంక సింగ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
ఈ రోజు ఎపిసోడ్ కి సంబంధించిన ఓ ప్రోమో విడుదల చేశారు. అందులో సినిమా పేర్లు ఇచ్చి.. అవి ఎవరికి సూట్ అవుతాయో చెప్పాలని అన్నారు నాగార్హున. ప్రియాంక ‘మహానటి’ అని.. ‘అర్జున్ రెడ్డి’ సన్నీ అని, శ్రీరామ్ రేలంగి మావయ్యా అని, మానస్ ‘అపరిచితుడు’గా హౌస్ మేట్స్ ఎంపిక చేశారు. మొత్తానికి ఈ రోజు బిగ్ బాస్ లో నవ్వుల సందడి ఓ రేంజ్ లో ఉండబోతున్నట్లు తెలుస్తుంది. తర్వాత మరో ప్రోమో విడుదలైంది. అందులో హౌస్ మేట్స్ కి కొన్ని సినిమా పాటలు ఇచ్చి, నోట్లో నీళ్లు వేసుకొని ఆ పాట పాడమని చెప్పారు.
నోట్లో నీళ్లతో ఆ పాట పాడలేక వాళ్లు పడ్డ ఇబ్బందులు నవ్వులు పూయించాయి. అయితే మానస్ మాత్రం ‘బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టరే’ అనేది కరెక్ట్ గా చెప్పాడు. దాంతో షణ్ముక్, సిరి, మానస్ ఆ పాటపై డ్యాన్స్ చేశారు. తరువాత డైస్ తో ఓ గేమ్ ఆడించారు. ఇందులో సన్నీకి పనిష్మెంట్ రావడంతో ‘ఎపిసోడ్ అయ్యేవరకు లిప్స్టిక్ అండ్ ఐలైనర్ వేసుకొని ఉండాలని’ నాగార్జున చెప్పారు. దాంతో ఇంటి సభ్యులైన కాజల్, పింకి ఇద్దరూ సన్నీకి మేకప్ వేశారు.
ఇక మానస్ కి క్వశ్చన్ రావడంతో.. ‘ఈ ఇంట్లో సింపతీ సీకర్ ఎవరని’ అడిగారు నాగార్జున. దానికి మానస్.. నాకు మొదటి నుంచి కాజల్ సింపతీ సీకర్ అనిపిస్తుంది సార్ అన్నారు. దానికి నాగార్జున ‘నావాళ్లే ఇలా అంటే ఎలా రా..?’ హా… అంటూ కాజల్ ని ఇమిటేట్ చేశారు. అంతే ఇంటి సభ్యులంతా గొల్లున నవ్వుకున్నారు. మొత్తానికి ఈ సండే ఫన్ డేగానే ఉండబోతున్నట్లు కనిపిస్తుంది.
#Nagarjuna imitating #Kajal 😂… #Sunny is funny in make up#BiggBossTelugu5 today at 9 PM on #StarMaa #FiveMuchFun pic.twitter.com/bBnJqvWmhx
— starmaa (@StarMaa) December 5, 2021