బిగ్ బాస్ సీజన్ 5 ఫైనల్స్ లో ఎవరు ఉంటారనే విషయం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం హౌస్ లో టాప్ 5 లో ఎవరు ఉంటారో అన్న విషయంపై తెగ చర్చలు నడుస్తున్నాయి. అయితే టాస్క్ విషయంలో ఎవరూ తగ్గడం లేదే. బిగ్ బాస్ సీజన్ 5 ఇప్పటివరకు 89 ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది. 19 మంది కంటెస్టెంట్స్ తో షో మొదలవ్వగా.. 12 మంది ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం హౌస్ లో ఏడుగురు హౌస్ మేట్స్ ఉన్నారు. మూడు రోజులుగా బిగ్ బాస్ హౌస్ లో ‘టికెట్ టు ఫినాలే’ టాస్క్ నడుస్తోంది.
‘ఎండ్యూరెన్స్’ ఛాలెంజ్ ఐస్ టబ్ లో ఎక్కువసేపు ఉన్న కారణంతో శ్రీరామ్, సిరి కాళ్లకు తీవ్ర ఇబ్బంది కావడంతో వారికి డాక్టర్ చే ట్రీట్ మెంట్ ఇప్పించారు. రెండు రోజులుగా శ్రీరామ్ ఆరోగ్యం బాగాలేకపోవడంతో.. అతడి గేమ్స్ అన్నీ కూడా సన్నీనే ఆడుతున్నాడు. అతడు ‘టికెట్ టు ఫినాలే’ గేమ్ లో ముందుకు సాగడానికి కారణం కూడా సన్నీనే. ఇక నిన్నటి ఎపిసోడ్ లో ఫస్ట్ ఫైనలిస్ట్ గా గెలిచిన శ్రీరామచంద్ర సేఫ్ అని అనౌన్స్ చేశారు నాగార్జున. ఆ తరువాత సన్నీ-షణ్ముఖ్ చేతుల మీదుగా ఫైనలిస్ట్ ట్రోఫీను అందించారు. అంతకు ముందు స్టేజ్ పై నాగార్జున ఒకింత శ్రీరామ్ ని టెన్షన్ కి గురి చేశారు.
హౌస్ మేట్స్ ముందు ఫస్ట్ ఫైనలిస్ట్ ట్రోఫీ పెట్టి.. ‘నువ్ సేఫ్ అయితే ట్రోఫీ నీకు దక్కుతుంది లేదంటే లేదు’ అంటూ శ్రీరామ్ ని ఉద్దేశిస్తూ నాగార్జున కామెంట్స్ చేస్తూ కనిపించారు. మొత్తానికి మానస్ చేతులు మీదుగా శ్రీరామ్ అదృష్టాన్ని పరీక్షించాడు. శ్రీరామ్ సేఫ్ అవ్వడంతో అతడికి సన్నీ-షణ్ముఖ్ చేతుల మీదుగా ఫస్ట్ ఫైనలిస్ట్ ట్రోఫీ ఇప్పించారు.