తెలుగు టెలివిజన్ రియాలిటీ షో బిగ్ బాస్-5 చివరి దశకు చేరుకుంది. ఈ సీజన్ మరికాసేపట్లో ముగియనుంది. 15 వారాల పాటు అత్యంత విజయవంతంగా సాగిన ఈ షోకు కాసేపట్లో తెరపడనుంది.మొత్తం 19 మందితో మొదలైన ఈ సీజన్ లో ఇప్పటి దాకా 14 వారాల్లో 14 మంది ఎలిమినేట్ అయ్యారు. అయితే ఇప్పుడు ఈ సీజన్ లో సన్నీ లేదా షన్ను ట్రోఫీ గెలిచే అవకాశం ఉందని ప్రచారం జరుగుతూ ఉండగా ఇప్పుడు షన్నుకు ట్రోఫీ దక్కలేదని తెలుస్తోంది. దీనిపైన షణ్ముఖ్ గర్ల్ ఫ్రెండ్ దీప్తి సునైనా హింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: తీవ్ర నిరాశలో షణ్ముక్ ఫ్యాన్స్! సిరి కొంప ముంచిందా?
19 మందిలో 14 మంది ఎలిమినేట్ కావడంతో ఈ సీజన్‌లో మానస్, శ్రీరామ చంద్ర, సిరి హన్మంత్, షణ్ముఖ్ జస్వంత్, వీజే సన్నీలు ఫినాలేకు చేరుకున్నారు. వీళ్లంతా స్ట్రాంగ్ కంటెస్టెంట్లు కావడంతో.. ఇందులో ఎవరు విజేతగా నిలుస్తారు అనే అంశం మీద ఆసక్తి నెలకొంది. ఈ సీజన్‌లో వచ్చిన రోజు నుంచే టైటిల్ రేసులో ఉన్నవారిలో షణ్ముఖ్ జస్వంత్ ఒకరు. అయితే షణ్ముఖ్ గర్ల్ ఫ్రెండ్ దీప్తి సునైనా అతను ఇంట్లోకి ప్రవేశించినప్పటి నుండి అతనిని సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తూ వచ్చింది. షన్నుకు ఓటింగ్ ఎక్కువచ్చేలా దీప్తి తన వంతు ప్రయత్నాలు చేసింది. కానీ.. షన్ను టైటిల్ కోల్పోయాడని వార్తలు వినిపిస్తోన్న నేపథ్యంలో దానికి ఊతం ఇచ్చేలా దీప్తి సునైనా కూడా హింట్ ఇచ్చింది.
ఆమె సోషల్ మీడియా పోస్ట్ ద్వారా షణ్ముఖ్ ట్రోఫీని గెలుచుకునే అవకాశాన్ని కోల్పోయినట్లు హింట్ ఇచ్చింది. ”జీవితంలో ప్రతీదీ ఏదో ఒక కారణంతోనే జరుగుతుంది”,షణ్ముఖ్ కోసం నిలబడినందుకు థాంక్స్, ఆ ప్రేమ అందించినందుకు థాంక్స్ అంటూ ఇన్‌స్టాగ్రామ్ లో దీప్తి పోస్ట్ చేసింది. షణ్ముఖ్ టైటిల్ విన్నర్ గా నిలిచుంటే.. దీప్తి ఇలా వేదాంత ధోరణిలో పోస్ట్ పెట్టదు కదా? దీని బట్టి చూస్తే.. షణ్ముఖ్ కి టైటిల్ దక్కలేదన్న కామెంట్స్ వినింపిస్తున్నాయి. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.