‘బిగ్ బాస్ 5 తెలుగు’ ఆఖరి వారానికి చేరుకుంది. తమ అభిమాన కంటెస్టెంట్ ని విన్నర్ గా చూడాలని ఫ్యాన్స్ తెగ కష్టపడుతున్నారు. రోజూ తమ అభిమాన కంటెస్టెంట్ కు ఓట్లు వేస్తూ గట్టిగానే ట్రై చేస్తున్నారు. అసలు ఎవరు విన్నర్ అవుతారనే దానిపై అంతా చర్చ నడుస్తోంది. మరి ఓటింగ్ పరంగా విన్నర్ ను ఎంపిక చేసే పనైతే ఫేమస్ యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ విన్నర్ అవుతాడనే టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే బిగ్ బాస్ లో ఎలిమినేషన్, విన్నర్ సెలక్షన్ ఏదైనా ప్రేక్షకుల ఓటింగ్ మీదనే ఆధారపడి ఉంటుందని చెబుతుంటారు. మరి, అదే జరిగితే షణ్ముఖ్ కచ్చితంగా విజయం సాధిస్తాడని బలంగా వాదిస్తున్నారు.
షణ్ముఖ్ కు ఉన్న ఫ్యాన్ బేస్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్న మరే కంటెస్టెంట్ కు లేదనే చెప్పాలి. ఎందుకంటే వెబ్ సిరీస్ లు, కవర్ సాంగ్స్ తో షణ్ముఖ్ చాలా మందే అభిమానులను పొందాడు. అదే ఫ్యాన్ బేస్ బిగ్ బాస్ లో ఇంతకాలం అతను ఉండటానికి ఉపయోగపడింది. అదే లాజిక్ తో ఇప్పుడు విన్నర్ కూడా అవుతాడని చెబుతున్నారు. ఆట పరంగా షణ్ముఖ్ పై చాలా విమర్శలు వచ్చాయి. సిరి విషయంలోనూ చాలానే నెగెటివిటీని మూటగట్టుకున్నాడు. మరి గేమ్ పరంగా విన్నర్ ను ఎంపిక చేస్తారా? ఓట్స్ పరంగా చేస్తారా? అన్న దానిపైనే ఆధారపడి ఉంటుంది.
షణ్ముఖ్ ను విన్నర్ ని చేస్తామంటూ హీరో సూర్యా అభిమానులు సైతం శపథం పూనిన విషయం తెలిసిందే. షణ్ముఖ్ ఫ్యాన్స్ + సూర్యా ఫ్యాన్స్ కూడా తోడైతే ఓట్లు ప్రభంజనమే అని భావిస్తున్నారు. గేమ్ పరంగా అయితే హౌస్ లో సన్నీ చాలా మంచి పేరు సంపాదించాడు. బయట గత సీజన్ల కంటెస్టెంట్లు సైతం చాలా వరకు సన్నీకి సపోర్ట్ చేస్తున్నారు. అసలు విన్నర్ ఎవరో తెలియాలంటే ఇంకో వారం ఆగాల్సిందే. షణ్ముఖ్ జశ్వంత్ బిగ్ బాస్ విన్నర్ కాగలడా? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.