‘బిగ్ బాస్ 5 తెలుగు’ ఇంకా రోజులే ఉంది. గ్రాండ్ ఫినాలేకి సమయం ఆసన్నమైంది. హౌస్ లో ఉన్న టాప్- 5 కంటెస్టెంట్ల గురించి ఇప్పటివరకు హౌస్ లో వారి జర్నీ గురించి ఒక వీడియో చేసి చూపిస్తున్నారు. హౌస్ లో వారు ఆడిన టాస్కులు, పడిన గొడవలు అన్నీ ప్రతిబింబించేలా ఒక ఎమోషనల్ జర్నీని చూపించారు. అందులో భాగంగా వీజే సన్నీకి తన జర్నీ చూపించారు. బిగ్ బాస్ వీజే సన్నీపై ప్రశంసల జల్లు కురిపించారు. సన్నీ- సరదా రెండూ Sతోనే మొదలవుతాయి. సర్వైవర్- సన్నీ కూడా Sతోనే మొదలవుతాయి అంటూ ప్రాసలతో సన్నీ ఎమోషనల్ జర్నీని చూపించారు.
అప్పట్లో నాగార్జునకు ఎంతో నచ్చిన కేకు టాస్కును కూడా పెట్టారు. మళ్లీ కేకు ఎందుకు పెట్టారో రీజన్ చెప్పలేదు. ఈసారి మాత్రం సన్నీ కేకును తన మిత్రులతో షేర్ చేసుకుంటానన్నాడు. హౌస్ లో సన్నీ గేమ్ ను, అతనిపై అభిమానాన్ని పెంచింది కత్తి పోట్ల టాస్కు. ఆ టాస్కుకు సంబంధించిన ప్రాపర్టీని సన్నీ తీక్షణంగా చూసుకున్నాడు. కాజల్- ప్రియాంకను కోతులతో పోలుస్తూ మళ్లీ ఫన్ చేశాడు. ఇప్పుడు బయట వినిపిస్తున్న టాక్.. బిగ్ బాస్ సన్నీనే విన్నర్ అని క్లూ ఇస్తున్నాడా? అని. ఎందుకంటే సన్నీ జర్మీ ఫుల్ ప్యాక్డ్ మీల్స్ లా ఉంది. ఫన్, ఎమోషన్, ఫ్రెండ్ షిప్ ఆ రేంజ్ కవర్ సాంగ్స్ అంతా క్రెడిట్ ఎడిటర్ మామదే అంటూ సోషల్ మీడియాలో సన్నీ ఫ్యాన్స్ పొగిడేస్తన్నారు.
ఎవరు అవుతారు విన్నర్ అనే ఉత్కంఠ అందరికీ ఉంది. కానీ, సన్నీ పేరే ఎక్కువగా వినిపిస్తోంది. మరోవైపు జర్నీ వీడియో చూశాక బిగ్ బాస్ కూడా సన్నీనే ఎత్తాలనుకుంటున్నాడు అంటూ కొందరు ప్రశంసలు, కొందరు విమర్శలు చేస్తున్నారు. అదే నిజం అయితే బిగ్ బాస్ 5 తెలుగు సీజన్ టైటిల్ విన్నర్ సన్నీనే అయ్యేలా కనిపిస్తున్నాడు. బిగ్ బాస్ 5 తెలుగు విన్నర్ ఎవరు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.