బిగ్ బాస్ 5వ సీజన్.. ఆశించిన ఫలితం ఇచ్చిందా లేదా అనే విషయం విషయం పక్కనపెడితే.. ఈసారి హౌజ్ లో పాల్గొన్న కంటెస్టెంట్స్ పంట పండిందనే చెప్పాలి. 5వ సీజన్ లో పాల్గొన్న సభ్యుల ఫైనల్ రెమ్యూనరేషన్స్ చూస్తే ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. ప్రస్తుతం సీజన్ 5 కంటెస్టెంట్లకు సంబంధించి రెమ్యూనరేషన్స్ లిస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బిగ్ బాస్ విన్నర్ VJ సన్నీ షోలో అడుగుపెట్టే ముందే వారానికి 2లక్షల చొప్పున అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ఆ విధంగా 15వారాలపాటు హౌస్ లో ఉండటంతో రూ.30 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నాడు. దీంతో పాటు ప్రైజ్ మనీ రూ.50 లక్షలు, రూ.25 లక్షల విలువైన ఫ్లాట్, రూ.2 లక్షల విలువైన టివియస్ అపాచీ బైక్‌ను అందుకున్నాడు. దీంతో సన్నీకి 80 లక్షల నగదు, 27 లక్షల బహుమతులు.. మొత్తానికి కోటి పైనే అందుకున్నట్లు సమాచారం.
2వ స్థానంలో నిలిచిన షణ్ముక్ జస్వంత్‌కు విన్నర్ కంటే ఎక్కువ ప్రైజ్ మనీ లభించిందట. వారానికి 4 – 5 లక్షల వరకు పారితోషికం తీసుకున్నట్లు టాక్. 15 వారాల్లో మొత్తంగా రూ.70 లక్షలకు పైగా వచ్చిందని సన్నిహిత వర్గాలు తెలిపాయట.
టాప్ 5లో నిలిచిన సిరికి రెమ్యూనరేషన్ బాగానే వచ్చినట్లు తెలుస్తోంది. హౌస్ లోకి వెళ్లకముందే వారానికి 2లక్షల వరకు అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే 15 వారాల్లో దాదాపు 30 లక్షలు ఖాతాలో వేసుకుందని సమాచారం. సిరి ట్రోఫీని గెలవకపోయినా ప్రైజ్ మనీలో సగానికి పైగా గెలుచుకుంది.
టాప్ 5లో నిలిచిన మానస్ బిగ్ బాస్ టీమ్ నుంచి మంచి రెమ్యూనరేషన్ అందుకున్నాడట. మానస్‌కి వారానికి 2లక్షలకు పైగా వచ్చాయని, మొత్తం 15 వారాలకు కలిపి 40 లక్షల వరకు అందుకున్నట్లు సమాచారం.శ్రీరామ్ చంద్ర కూడా బాగానే వెనకేసున్నట్లు తెలుస్తుంది. వారానికి 3లక్షల రూపాయల పైగా.. దాదాపు 50 లక్షల ప్రైజ్ మనీ అందుకుంటున్నాడట.
యాంకర్ రవి అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నాడని అంటున్నారు. వారానికి రూ.7 – 8 లక్షల వరకు రెమ్యునరేషన్ హౌస్‌లోకి వెళ్లి 12 వారాల్లో దాదాపు 90 లక్షలు అందుకున్నట్లు సమాచారం. ఈ సీజన్‌లో ఇదే అత్యధిక రెమ్యూనరేషన్ అని టాక్.
RJ కాజల్ వారానికి 2లక్షల చొప్పున 14 వారాల పాటు దాదాపు 30 లక్షలు వరకు అందుకుందట.
ప్రియాంక సింగ్ వారానికి రూ.1.75 – 2 లక్షల చొప్పున.. 13 వారాలకు దాదాపు రూ.25 లక్షలకు పైగా అందుకుంది.
యాని మాస్టర్ వారానికి రూ.3 లక్షల చొప్పున 11 వారాలకు రూ.33 లక్షలకు పైగా సంపాదించింది.
జెస్సి వారానికి రూ.1.5 లక్షల చొప్పున 10 వారాలకు రూ.15 లక్షలకు పైగా అందుకున్నాడు.
లోబోకి వారానికి 2.40 లక్షల చొప్పున 18 లక్షల నుంచి 20 లక్షలకు పైగా వచ్చినట్లు టాక్.
ఆర్టిస్ట్ ప్రియకు వారానికి రూ.1.5 లక్షల చొప్పున 7 వారాలకు రూ.10 లక్షలు వచ్చాయి.
శ్వేతవర్మకు వారానికి 1లక్ష చొప్పున 6 వారాలకు 6లక్షలు వచ్చినట్లు తెలుస్తోంది.
నటరాజ్ మాస్టర్ వారానికి 1లక్ష చొప్పున 4 వారాల్లో దాదాపు రూ.4 లక్షలు దక్కించుకున్నాడట.
ఉమాదేవికి వారానికి 80 వేల చొప్పున 2 వారాలకు 1.60 లక్షల పైగా రెమ్యునరేషన్ వచ్చిందట.
సరయుకి వారానికి 60 వేల చొప్పున రెమ్యునరేషన్ తీసుకుందని సమాచారం.
లహరికి వారానికి రూ.60,000 చొప్పున రెమ్యూనరేషన్ తీసుకుందట.
విశ్వ 9 వారాలకు దాదాపు 22 లక్షలు దక్కించుకున్నట్లు తెలుస్తుంది.
హమీద వారానికి రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం.