తెలుగు బుల్లితెరపై అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న వరల్డ్ బిగ్గెస్ట్ టెలివిజన్ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5లో భలే రసవత్తరంగా సాగుతుంది. మొదటి రెండు వారాలు కలిసికట్టుగా ఆడినా.. ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్ లో అందరూ మైండ్ గేమ్ ఆడుతున్నారు.. గ్రూపులుగా విడిపోయారు. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5లో ఎలిమినేషన్ డే వచ్చేసింది. మరో కంటెస్టెంట్ బిగ్‌బాస్ హౌస్ నుంచి తన ఇంటికి వెళ్లిపోనున్నారు. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే హాట్ డిబేట్‌గా మారింది.
ఇప్పటిదాకా సరయు, ఉమాదేవి, లహరి షారీ, నటరాజ్ మాస్టర్, హమీదా ఖాతూన్, శ్వేతా వర్మ ఎలిమినేట్ అయ్యారు. వీరికి ఆశించిన స్థాయిలో వారికి ఓట్లు పడలేదు. తాజాగా ఈ వారం మొత్తంగా ఎనిమిది మంది ఎలిమినేషన్ కోసం నామినేట్ అయ్యారు. సింగర్ శ్రీరామచంద్ర, లోబో, ఆర్జే కాజల్, జెస్సీ, ప్రియ, ఆనీ మాస్టర్, యాంకర్ రవి, సిరి హన్మంతు ఉన్నారు. వారిలో శ్రీరామచంద్ర, ఆర్జే కాజల్ ఇప్పటికే సేఫ్ అయ్యారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు సోషల్ మీడియాలో లీక్ అయిన సమాచారాన్ని బట్టి చూస్తే ఈ వారం ప్రియ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ కానున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈవారం నామినేషన్స్‌లో ఉన్న ఎనిమిది మందిలో ఆనీ మాస్టర్, జెస్సీ, లోబో ఈ ముగ్గురిలో డేంజర్ జోన్‌లో ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా ఆనీ మాస్టర్‌కి ఓట్లు తక్కువ పడుతుండటంతో ఆమె ఎలిమినేట్ అవుతుందనే అనుకున్నారు. కానీ, సీన్ రివర్స్ అయ్యింది.. మంగళవారం నాటి ఎపిసోడ్‌తో సీన్ పూర్తిగా మారిపోయింది.
బంగారు కోడిపెట్ట టాస్క్ సందర్భంలోనూ వీజే సన్ని, ప్రియ మధ్య గొడవలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. గుడ్లను దొంగిలించడానికి వచ్చిన ప్రియను వీజే సన్నినెట్టేయగా, చెంప పగలగొడతానంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇదంతా ప్రియకు నెగెటివ్‌గా మారిందనే అంచనాలు ఉన్నాయి. నిన్నటి ఎపిసోడ్ లో నాగార్జున కూడా ఇదే ప్రస్థావించారు.. పదే పదే చెంప పగలగొడతానంటూ వార్నింగ్ ఇవ్వడం మంచి పద్దతి కాదని అన్నారు. ఇదిలా ఉంటే.. సీక్రెట్ రూమ్‌లోకి వెళ్లిన లోబో కూడా ప్రియను డూప్‌గా అభివర్ణించాడు. ఇవన్నీ వెరసి ఈ వారం ప్రియకు నెగెటివ్ రిమార్క్స్ పడేలా చేశాయి. ఏది ఏమైనా.. సన్నీ ఫ్యాన్స్ ఓట్లు భారీగా పడుతుండటంతో ఆనీ మాస్టర్ సేవ్ అయ్యి ప్రియ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.