‘బిగ్ బాస్ 5 తెలుగు’ సీజన్ దాదాపు ముగింపునకు చేరుకుంది. ఇంకా నిండా మూడు వారాలు కూడా లేవు. మామూలుగా బిగ్ బాస్ హౌస్ లో సెలబ్రిటీలు ఉంటే బయట వారి అభిమానులు గొడవలు పడటం మామూలే. సపోర్ట్ విషయంలో షణ్ముఖ్- సన్నీ ఫ్యాన్స్ మధ్య రచ్చ కొనసాగుతూనే ఉంది. అది వేరే విషయం. కానీ, వారికి నచ్చని కంటెస్టెంట్ పై బురద జల్లే ప్రయత్నం చేస్తుంటారు కొందరు. అలా చాలా గట్టిగానే ప్రయత్నించిన ఒక యూట్యూబర్ కు బిగ్ బాస్ 4 రన్నర్ గా నిలిచిన అఖిల్ సార్థక్ ఫైర్ అయ్యాడు.
ఒక యూట్యూబర్ షణ్ముఖ్ ను ‘నిన్ను ఎక్కడో చూసినట్టుందే.. పొద్దున్నే పాల ప్యాకెట్లు, చెత్త కాగితాలు ఎత్తుకుపోయేది మీరే కదూ.. గుర్తుపట్టాను. నీ ముఖం అయితే 5 పైసలు ఉంటది. చెత్త కాగితాలు ఏరుకునే వాడు రాయి పట్టుకుని కుక్కల వెనకాల తిరుగుతాడు చూడు అచ్చు నీలాగే ఉంటాడు షణ్ముఖ్’ అంటూ చాలా దారుణంగా కామెంట్ చేశాడు. అది చూసిన అఖిల్ సదరు యూట్యూబర్ పై సీరియస్ అయ్యాడు. ‘మరీ అంత నెగెటివిటీ ఎందుకు? రేపు ఉంటామో.. ఎప్పుడు పోతామో తెలీదు. మరీ అంతలా బాడీ షేమింగ్ చేయాలా? అంత హ్యూమిలియేటింగ్ ఉంది కాబట్టే రెస్పాండ్ అయ్యాను. కాగితాలు ఎరుకునే వాళ్లు మనుషులు కాదా’ అంటూ అఖిల్ ప్రశ్నించాడు.
‘హౌస్ లో ఉండే వారికి తెలుస్తుంది. అది ఒక గేమ్ మాత్రమే.. అలాగే చూడండి. నేను ఎవరికీ సపోర్ట్ చేయడానికి రాలేదు. కంటెస్టెంట్ ఎవరైనా అలా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఎవరైనా ఒక్కటే’ అంటూ అఖిల్ రెస్పాండ్ అయ్యాడు. ఎవరినైనా అలా కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. ఎప్పుడు పోతామో తెలీదు అంటూ అఖిల్ చెప్పుకొచ్చాడు. అఖిల్ కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.