‘బిగ్ బాస్ 5 తెలుగు’ మోస్ట్ రన్నింగ్ సక్సెఫుల్ షోగా పేరొందింది. గత సీజన్ తరహాలోనే ఈ సీజన్ లోనూ ఒక ట్రాన్స్ జెండర్‌ను హౌస్‌లోకి పంపిన విషయం తెలిసిందే. జబర్దస్త్ షోలో లేడీ గెటప్స్ వేస్తూ ఈ తర్వాత ఆపరేషన్ చేయించుకుని సాయితేజ అలియాస్ ప్రియాంక సింగ్‌గా మారిన విషయం అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ హౌస్‌లో ప్రియాంక సింగ్ బాగానే పర్ఫామ్ చేస్తోంది అని అందరూ అంటున్నారు. తనకు మెగా బ్రదర్ నాగబాబు సైతం సపోర్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ అంశంలో ప్రియాంక సింగ్ కు ఓ షాక్ తగిలింది. అసలు ప్రియాంక సింగ్ అంటే ఎవరో కూడా తనకు తెలీదు అంటూ తెలంగాణ రాష్ట్ర హిజ్రా ఫౌండర్ చంద్రముఖి అన్నారు. అంతే కాకుండా బిగ్ బాస్‌లో ప్రియాంకకు తాము సపోర్ట్ చేయట్లేదని తేల్చేశారు.
‘పుట్టుకతో ఫెమినీటతో పుట్టడం వేరు.. 24 గంటలు చీర కట్టుకుని ఫెమినిటీ పెంచుకోవడం వేరు. ట్రాన్స్‌జెండర్‌గా మారడం అంటే అంత ఈజీ కాదు. ముందు సైకియాట్రిస్ట్‌ను కలవాలి. ఇలా అమ్మాయిగా మారాలనిపిస్తోందని చెప్పాలి. అతను ఒక రెండేళ్లు అమ్మాయిలా దుస్తులు వేసుకోమని చెప్తాడు. ఆ రెండేళ్లు అతను కౌన్సిలింగ్ ఇస్తాడు. ఆ తర్వాత కూడా నీకు అమ్మాయిలాగే ఉండాలనిపిస్తే అప్పుడు సర్జరీ చేసుకోవాల్సిందిగా సూచిస్తారు. అంతేకానీ ఓవర్‌నైట్‌లో నిర్ణయం తీసుకోవడం కాదు’ అంటూ చంద్రముఖి తీవ్రంగా స్పందించారు. గతంలో బిగ్ బాస్‌కు వెళ్లిన సింహాద్రి తమన్నా మా కమ్యూనిటీకి చెందిన ఆమె.. అప్పుడు మేమంతా సపోర్ట్ చేశాం. ఇప్పటికీ తమన్నా నాకు మంచి స్నేహితురాలు అంటూ చంద్రముఖి స్పందించింది. ‘మా కమ్యూనిటీలో ఉంటే మా సపోర్ట్ ఉండేది. మా కమ్యూనిటీలో లేదు కాబట్టి మేము సపోర్ట్ చేయం’ అంటూ చంద్రముఖి స్పష్టం చేసింది. మరి ఇలా అయితే ప్రియాంక సింగ్ ఇంకా ఎన్నాళ్లు హౌస్‌లో కొనసాగుతుందో చెప్పడం కష్టమే అంటూ కామెంట్ చేస్తున్నారు.