కొంచెం ఇష్టం, కొంచెం కష్టం అన్నట్టు సాగుతోన్న బిగ్ బాస్ సీజన్ 5 ముడి వారంలోకి ప్రవేశించింది. ఇప్పటికే హౌస్ లో నుండి సరయు, ఉమాదేవి బయటకి వచ్చేశారు. అయితే.., తాజాగా విడుదలైన ప్రోమోలో మూడో వారం ఎలిమినేషన్ ప్రాసెస్ హైలెట్ అయ్యింది. ఈ విషయంలో కంటెస్టెంట్స్ ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ రచ్చ రచ్చ చేశారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం మూడో వారంలో ఎలిమినేషన్ కి 5మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయినట్టు తెలుస్తోంది.
వీరిలో ప్రియాంక, మానస్, శ్రీరామ్, లహరి, ప్రియలు నామినేట్ అయినట్టు సమాచారం. వీరిలో ప్రియాంక, మానస్, ప్రియలు రెండో సారి నామినేట్ కాగ, లహరి, శ్రీరామ్‌లు తొలిసారి నామినేషన్ జోన్‌లోకి వచ్చారు. మరి.. వీరి నుండి మూడో వారంలో బయటకి వెళ్లే కంటెస్టెంట్ ఎవరో చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.