‘బిగ్ బాస్ 5 తెలుగు’ సీజన్ గ్రాండ్ ఫినాలేకి ఇంకా కొద్ది రోజులే ఉన్నాయి. హౌస్ లో మొత్తం ఆరుగురు మాత్రమే ఉన్నారు. టాప్ 5 కోసం నానా తంటాలు పడుతున్నారు. ప్రస్తుతం హీరోలను ఇమిటేట్ చేస్తూ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. హౌస్ లో లేక పోయినా కూడా ఇప్పుడు యాంకర్ రవి పేరు బాగా వినిపిస్తోంది. వియ్ మిస్ యూ రవి అంటూ చెప్తున్నారు. కలలోకి వచ్చాడంటున్నారు. అయితే నామినేట్ చేసి ఎలిమినేట్ చేసి ఇప్పుడు ఏంటని ప్రశ్నిస్తున్నారు కొందరు. అవన్నీ పక్కన పెడితే.. షణ్ముఖ్ తో రిలేషన్ పై యాంకర్ రవి ఓపెన్ అయ్యాడు. అంతే కాదు బిగ్ బాస్ యాజమాన్యానికి కూడా చురకలు అంటించాడు.
‘షణ్ముఖ్ ఏం చెప్పినా వింటాడు. కానీ, దానికి టైమ్ పడుతుంది. అది 3 గంటలా? 3 రోజులా అన్నది చెప్పలేం. అతను అన్నీ లెక్కలు వేసుకుని, విశ్లేషించుకుని నిర్ణయం తీసుకుంటాడు. మా మధ్య జరిగింది ఏంటంటే.. ఒరేయ్ నువ్ నాకు కనెక్ట్ అయ్యావ్ రా అంటుంటే.. లేదు నాకు కనెక్ట్ కాలేదు అనేవాడు. నాకు టైమ్ కావాలి అనే వాడు. నేను సన్నీ, శ్రీరామ్, షణ్ముఖ్ తో కనెక్ట్ అయ్యాను. సన్నీతో వేరే బాండింగ్. ఇద్దరం యాకంర్ ఫీల్డ్ నుంచి వచ్చాం కాబట్టి కామెడీ టైమింగ్ బాగుండేది. హౌస్ లో అందరినీ ఎంతో నవ్వించాం. అవేమీ టెలికాస్ట్ కాలేదు. సన్నీ వచ్చి బావా ఏం కంటెంట్ ఇద్దాం అంటే.. చెప్పేవాడిని. షణ్ముఖ్ తోనూ అలాగే చెప్తే.. వాడు ఇన్ ఫ్లుఎన్సర్ అని పేరు పెట్టాడు’ అంటూ చెప్పుకొచ్చాడు.
‘బిగ్ బాస్ హౌస్ లో మీకు తెలియనివి చాలా జరిగాయి. అవేమీ టెలికాస్త్ కాలేదు. ఆడియన్స్ ని తప్పుదోవ పట్టించే కంటెంట్ మాత్రమే ప్రసారం చేస్తున్నారు. ప్రేక్షకులను వేరే దారిలోకి తీసుకుపోవడం వల్ల సోషల్ మీడియాలో హంగామా జరుగుతుంది. బిగ్ బాస్ కు ప్రమోషన్స్ అన్నట్లుగానే టెలికాస్ట్ చేస్తున్నారు. నేను ఫుటేజ్ చూశాక చాలా బాధ పడ్డాను. శ్రీరామచంద్ర ఏ పని చేసినా పాటలు పాడుతూ ఉండేవాడు. కానీ, వీకెండ్ లో నాగార్జున సార్ వచ్చి ఏంటి శ్రీరామ్ పాటలు పాడవు అనేవారు.
అతను పాడేదీ లేనిది ఇంట్లో ఉన్న వారికి తెలుస్తుంది. టెలికాస్ట్ చేయకపోతే తెలియదు కదా. శ్రీరామ్ పాడుతూనే ఉండేవాడు. ఏ పని చేసినా శ్రీరామ్ పాటలు పాడుతూనే ఉండేవాడు. అలాంటి వాటిని కూడా టెలికాస్ట్ చేయలేదు. ఆడియన్స్ ను తప్పుదోవ పట్టించేవి మాత్రమే టెలికాస్ట్ చేస్తున్నారంటూ’ రవి ఆవేదన వ్యక్తం చేశాడు. మరి, బిగ్ బాస్ హస్ నుంచి వచ్చిన రవి ఇలా మాట్లాడటం అందరినీ షాక్ కు గురిచేస్తోంది. అంటే హోస్ట్ నాగార్జునకు కూడా మొత్తం ఫుటేజ్ చూపించరా? సెలక్టివ్ గానే చూపిస్తారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రవి చేసిన వ్యఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.