‘బిగ్ బాస్ 5 తెలుగు’ హౌస్ నుంచి బయటకు వచ్చాక యాంకర్ రవి గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. రవిని అన్యాయంగా ఎలిమినేట్ చేశారని అతని ఫ్యాన్స్ నిరసనలు కూడా చేశారు. అన్ని రోజులు ఫ్యామిలీకి దూరంగా గడిపిన రవి.. కుటుంబంతో కలిసి చిన్న వెకేషన్ కు కూడా వెళ్లాడు. అయితే సోషల్ మీడియాలో రవికి అసభ్యకర సందేశాలు వస్తున్నాయని గతంలోనూ చెప్పాడు. ఇప్పుడు అలాంటి వాటిపై కాస్త సీరియస్ గా స్పందించాడు. అలాంటి వారిపై న్యాయపోరాటం చేస్తానని ప్రకటించాడు. అంతేకాదు.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. కొన్ని మెసేజ్ లను ఇన్ స్టా వేదికగా పంచుకున్నాడు.
‘అయ్యిందేదో అయ్యింది. ఇక నుంచి ఎలాంటి ట్రోలింగ్ ను సహించేది లేదు. వచ్చే ప్రతి నెగెటివ్ మాట, నెగెటివ్ పోస్ట్, మెసేజ్ ఎవరి మీదైనా.. ఎప్పుడైనా.. ఏ సమయంలోనైనా నేరుగా ఫిర్యాదు చేస్తాను. అలాంటి వారిని వదిలిపెట్టను. న్యాయపరంగా అలాంటి వారికి శిక్ష పడేలా ఎంత దూరమైనా వెళ్తాను’ అంటూ రవి ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ షేర్ చేశాడు. మరోవైపు ఇలా చేయడం వల్ల ఫేక్ అకౌంట్లు కూడా ట్రాక్ అవుతాయని అభిప్రాయ పడ్డాడు.
రవి ఫేక్ అకౌంట్ల ప్రస్తావన మరో అనుమానానికి దారి తీస్తోంది. అంటే రవిని ఎవరన్నా కావాలనే టార్గెట్ చేసి ఇలా మెసేజ్ లు పెడుతున్నారా? రవికి ఎవరి మీదైనా అనుమానం ఉండే ఇలా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడా అని తెలియాల్సి ఉంది. రవి తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.