‘బిగ్ బాస్ 5 తెలుగు’ మరింత ఉత్కంఠభరితంగా సాగుతోంది. రోజులు గడుస్తున్న కొద్దీ ఆట రసవత్తరంగా సాగుతోంది. ఇంట్లోని సభ్యుల మధ్య మాటల యుద్ధాలు ముదురుతున్నాయి. తాజాగా జరిగిన బిగ్ బాస్ హోటల్ కెప్టెన్సీ పోటీదారుల టాస్కులో సభ్యులు అందరూ తమ బెస్ట్ ఇచ్చారు. వారిలో నలుగురు మాత్రమే కెప్టెన్సీ పోటీదారులుగా ఎంపికయ్యారు. వారిలో సన్నీ, కాజల్, రవి, సిరి పోటీదారులుగా ఎంపికయ్యారు. సన్నీ, కాజల్, సిరి పర్ఫామెన్స్ తో పోటీదారులయ్యారు. రవి మాత్రం బిగ్ బాస్ సీక్రెట్ టాస్కులో విజయం సాధించి పోటీదారుడు అయ్యాడు. అతిథులకు సరిగ్గా సేవలు అందకుండా చేయడంలో రవి సక్సెస్ అయ్యాడు. ఆ విధంగానే కెప్టెన్సీ పోటీదారుడిగా ఎంపికయ్యాడు.
హౌస్‌లోకి ఎంటర్ అయ్యినప్పటి నుంచి యాంకర్ రవి కెప్టెన్ అయ్యేందుకు బాగా ట్రై చేస్తున్నాడు. ఎట్టకేలకు అతని కల నెరవేరింది. బిగ్ బాస్ 5 తెలుగు ఈ వారం కెప్టెన్‌గా రవి గెలిచాడు. బిగ్ బాస్ ఇచ్చిన టవర్ టాస్కులో విజయం సాధించి కొత్త కెప్టెన్ గా అయ్యాడు. సీక్రెట్ టాస్కులో విజయం సాధించేందుకు రవి చాలానే కష్టపడ్డాడు. ముఖ్యంగా కాజల్‌ను బాగా ఇబ్బంది పెట్టాడు. ఒకానొక సమయంలో రవి సీక్రెట్ టాస్కు చేస్తున్నట్లు అందరికీ డౌట్ వచ్చింది. కానీ, తన సహజసిద్ధమైన నటనతో రవి తన మీద అనుమానం రాకుండా మేనేజ్ చేయగలిగాడు. టాస్కులో కూడా అద్భుతంగా రాణించి రవి కెప్టెన్ కాగలిగాడు. ఎప్పటిలాగానే ఈసారి కూడా కెప్టెన్సీ టాస్కులో ఇంట్లోని సభ్యులు అంతా నానా రచ్చ చేశారు.