తెలుగు లో వస్తున్న బిగ్ బాస్ రియాల్టీ షో సీజన్ 5 కొనసాగుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తాజాగా జరుగుతోన్న సీజన్‌లోకి 19 మంది కంటెస్టెంట్లు ఒకేసారి వచ్చారు. వీరిలో వారానికి ఒకరు చొప్పున 14 మంది ఎలిమినేట్ అయిపోయారు. బిగ్ బాస్ సీజన్ 5 చివరికి చేరింది. ‘బిగ్ బాస్’ షో చివరకు వచ్చేయడంతో ఇప్పుడు ప్రేక్షకుల్లో దీని ఫీవర్ ఎక్కువ ఉంది. ఈ సీజన్‌లో మానస్, శ్రీరామ చంద్ర, సిరి హన్మంత్, షణ్ముఖ్ జస్వంత్, వీజే సన్నీలు ఫినాలేకు చేరుకున్నారు. వీళ్లంతా స్ట్రాంగ్ కంటెస్టెంట్లే కావడంతో.. ఇందులో ఎవరు విజేతగా నిలుస్తారు అన్న దానిపై ఆసక్తి నెలకొంది.
ఈ ఐదుగురు కంటెస్టెంట్స్ లో ఎవరు విన్నర్ అన్న విషయం పై విపరీతమైన చర్చలు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే కింగ్ అక్కినేని నాగార్జునకు కూడా ‘బిగ్ బాస్’ విన్నర్ గురించి ప్రశ్న ఎదురైంది. ఇదిలా ఉంటే కింగ్ నాగార్జున బాలీవుడ్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’లో కీలక పాత్రలో నటించారు. ఈ మూవీ తెలుగు లో కూడా రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా శనివారం ఉదయం ‘బ్రహ్మాస్త్ర’ తెలుగు మోషన్ పోస్టర్ విడుదల చేశారు.
ఇదీ చదవండి : డైరెక్టర్ రాజమౌళి కాళ్లు పట్టుకున్న బాలీవుడ్ స్టార్ హీరో!
ఇక ‘బిగ్ బాస్’ సీజన్ 5 గ్రాండ్ ఫినాలే షూటింగ్ ఉండటంతో నాగార్జున మిగతా సెలబ్రిటీల కంటే కొంత త్వరగా ప్రెస్ మీట్ నుంచి వెళ్లిపోయారు. అలా షూటింగ్ కి వెళ్లే సమయంలో నాగార్జునకు బిగ్ బాస్ విన్నర్ ఎవరు? అనే ప్రశ్న ఎదురైంది. ఇక్కడే నాగార్జున అందరికీ భలే ట్విస్ట్ ఇచ్చారు.. ‘మీరు ఎవర్ని గెలిపిస్తే వారు’అంటూ నవ్వుతూ వెళ్లిపోయారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.