‘బిగ్ బాస్ 5 తెలుగు’ సీజన్ లో ఇంకా 10 కంటే తక్కువ రోజులు ఉన్నాయి. ఇంట్లోని సభ్యులు టైటిల్ విన్నర్ అయ్యేందుకు చాలానే కష్టపడుతున్నారు. శనివారం, ఆదివారం అనగానే కింగ్ నాగార్జున ఎంట్రీ ఇస్తాడు. కంటెస్టెంట్లతో గేమ్స్ ఆడించడం, వారం మొత్తం జరిగిన దానిపై క్లాసులు పీకడం అన్నీ కామనే. అదే క్రమంలో ఏదో చేయబోయి కాజల్ ఇంకేదో అయిపోయింది. నాగార్జున ఇచ్చిన కౌంటర్ తో ఏం మాట్లాడాలో తెలీక తెల్ల మొహం వేసింది.
షణ్ముఖ్ పై కంప్లైంట్ చేయబోతే అది కాస్తా బ్యాక్ ఫైర్ అయ్యింది. ‘షణ్ముఖ్ ఎప్పుడూ ఒక విషయం నుంచి గతంలో జరిగినవి అన్నీ తీసి ఇంకో నాలుగు కంప్లైంట్ లు చెప్తాడు’ అంటూ చెప్పబోయింది. ఇంతలో నాగార్జున ఉండి నువ్వు కూడా అంతే కదా? అని రివర్స్ క్వశ్చన్ చేశాడు. అంతే దెబ్బకి కాజల్ షాకైంది. ఇంట్లోని సభ్యులు అందరూ నవ్వడం మొదలు పెట్టారు. సోషల్ మీడియాలోనూ అదే అంశంపై ట్రోలింగ్ కు గురైంది. కాజల్ కు నాగార్జున ఇచ్చిన కౌంట్ పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.