ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా చర్చ, రచ్చ జరుగుతున్న విషయం ఏదైనా ఉంది అంటే అది షణ్ముఖ్ జశ్వంత్- దీప్తీ సునయనల బ్రేకప్ విషయమే. కొత్త సంవత్సరం రెజల్యూషన్ అన్నట్లు షణ్ముఖ్ తో బ్రేకప్ చేసుకుని ఆ విషయాన్ని ఇన్ స్టా పోస్టు పెట్టేసింది దీప్తీ సునయన. దానికి నువ్వు ఎక్కడున్నా ఆనందంగా ఉండాలి అనే టైప్ లో షణ్ముఖ్ కూడా ఓ ఇన్ స్టాగ్రామ్ పోస్టు పెట్టేశాడు. చాలా మంది మరి సిరి ఎలా స్పందిస్తుందో అని ఎదురు చూశారు. అయితే కూడా జరిగిందిలెండి. కానీ, నేరుగా కాదు.. ఇన్ డైరెక్ట్ గా ఒక మోటివేషనల్ వీడియో ఒకటి ఇన్ స్టా స్టోరీగా పెట్టింది సిరి హన్మంత్.
ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ మునిబా మజారి చెప్పిన ఒక కోట్ ను తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీగా పెట్టింది. ‘ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మీ జీవితం చాలా టఫ్ గా ఉంది అని కామెంట్ చేస్తే.. వారి వైపు చూసి నవ్వుతూ నేను ఇంతకన్నా స్ట్రాంగ్ అని సమాధానం చెప్పు’ అనే కోట్ ను పోస్ట్ చేసింది. ఇప్పుడు ఆ పోస్టు పెట్టింది షణ్ముఖ్ కోసమే అనేది టాక్. అలా జరిగిన దానికి నువ్వు కుంగిపోకు నువ్వు ఇంతకన్నా ఎంతో స్ట్రాంగ్ అని చెప్పు అనేలా ఉంది అంటూ కామెంట్ చేస్తున్నారు.
అంతేకాదు.. వారి బ్రేకప్ కు నేను కారణం కాదు అని చెప్పుకుని తన సన్నిహితుల వద్ద సిరి హన్మంత్ బాగా ఎమోషనల్ అయ్యింది అని సమాచారం. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో సిరి- షణ్ముఖ్ రిలేషన్ వల్లే బయట దీప్తీ సునయన- షణ్ముఖ్ విడిపోయారని ఎంతో మంది కామెంట్ చేస్తున్నారు. ఆ విషయంలో సిరికి ఎన్నో నెగెటివ్ కామెంట్స్ ఎదురయ్యాయి. హగ్గుల విషయంలోనూ అందరూ సిరినే ఎక్కువ బ్లేమ్ చేసిన విషయం తెలిసిందే. అందుకే సిరి నేను కారణం కాదు అని ఎమోషనల్ అయినట్లు తెలుస్తోంది. దీప్తీ సునయన- షణ్ముఖ్ విడిపోవడానికి సిరినే కారణమా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.