తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకి బిగ్ బాస్ ఫీవర్ పెరుగుతోంది. బిగ్ బాస్ సీజన్-5 ఫినాలే దగ్గర పడుతుండటంతో ఫ్యాన్స్ అంతా వారి కంటెస్టెంట్ లకు ఓట్లు వేస్తూ మద్దతు తెలుపుతున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఆరుగురు సభ్యులు మాత్రమే ఉండగా.. అందులో సింగర్ శ్రీరామచంద్ర ఇటీవల ఫినాలేకి చేరుకున్నాడు. ఐతే గతంలో బిగ్ బాస్ షో పై వివాదాస్పద కామెంట్స్ చేసిన నటి శ్రీరెడ్డి మరోసారి తెరమీదకి వచ్చింది.
బిగ్ బాస్ షోలో అన్ని అలాంటి కథలే నడుస్తాయని పలు విమర్శలు గుప్పించిన శ్రీరెడ్డి.. తాజాగా సింగర్ శ్రీరామచంద్రకు వ్యతిరేకంగా మాట్లాడుతూ బిగ్ బాస్ సభ్యుడు షణ్ముఖ్ ను సపోర్ట్ చేయడం షాక్ కి గురిచేస్తోంది. బిగ్ బాస్ ప్రేక్షకులను షణ్ముఖ్ కి మాత్రమే ఓటు వేయాలనే విజ్ఞప్తి చేసింది. గతంలో శ్రీరెడ్డి సింగర్ శ్రీరామచంద్రతో ఉన్న విభేదాలు – అఫైర్స్ అన్ని బయటపెట్టిన సంగతి తెలిసిందే.
తాజాగా బిగ్ బాస్ షో పై శ్రీరెడ్డి మాట్లాడుతూ.. బిగ్ బాస్ షోపై చాలామందికి ఎన్నో అభిప్రాయాలు ఉన్నాయి. విలువలు మర్చిపోయి ఈ షోని ప్రసారం చేస్తున్నారు. ఈ విషయంలో వ్యక్తిత్వాలు దిగజార్చుకుని ప్రవర్తిస్తున్నారు. దీనిపై రాజకీయ దుమారం రేగుతోంది. బిగ్ బాస్ షోని ఆపేయాలని ఎప్పటి నుండో చెబుతున్నారు. ఈ షో వలన పిల్లలకు ఎలాంటి ఉపయోగం లేదు. ఈ షో ద్వారా పిల్లలు తప్పుదోవ పడుతున్నారని పేరెంట్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు.
నా విషయానికి వస్తే.. బిగ్ బాస్ లో కొన్నింటిని యాక్సెప్ట్ చేయలేకపోతున్నా. పిల్లలు చూస్తున్నారనే కామన్ సెన్స్ లేకుండా.. అసభ్యకరమైన వాటిని కనీసం ఎడిటింగ్ లో తీసేయకుండా ప్రసారం చేస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే.. ప్రస్తుతం బిగ్ బాస్ ఫైనలిస్ట్ గా ఉన్న శ్రీరామచంద్రకు ఎవరు ఓటు వేయకండి. మీ సపోర్ట్ అంతా యూట్యూబర్ షణ్ముఖ్ కి ఇవ్వాలని.. అతనే మొదటి నుండి జెన్యూన్ గా ఉన్నట్లు శ్రీరెడ్డి ఆలోచన బయటపెట్టింది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం హౌస్ లో ఉన్నవారిలో కంటెస్టెంట్ సిరి సపోర్ట్ కూడా షణ్ముఖ్ కే ఉంది.